భద్రాచలం ఆగస్ట్ 28 (జనవిజయం): భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో సూపర్డెంట్ రమేష్ కి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు భద్రాచలం తెలుగుదేశం పార్టీ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని,ముఖ్యంగా దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూములు, దళిత బంధు,బీసీలకు,మైనార్టీలకు ఆర్థిక సాయం అలాగే భద్రాచలం డివిజన్ ని పూర్తిగా విస్మరించిందని,భద్రాచల రామాలయ అభివృద్ధికి ఇస్తున్న 100 కోట్లు అలాగే భద్రాచలం అభివృద్ధికి ఇస్తానన్న 1000 కోట్లు ఈరోజు వరకు వంద రూపాయలు కూడా ఇవ్వలేదని తక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వినతి పత్రంలో సూచించారు. ఈ కార్యక్రమంలో కొడాలి శ్రీనివాస్, ఖమ్మం పాటి సురేష్ కుమార్, కుంచాల రాజారాం,అభినేని శ్రీనివాసరావు,కొడాలి చంటి, లాయర్లు రవితేజ,రామకృష్ణ ,పసుపులేటి రాంబాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు