వ్యాపార సంస్థల హమాలీల కూలీరేట్ల పెంపుకై నోటీసు
- పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్
వేంసూరు, జూలై13 (జనవిజయం):
మండల పరిధిలోని మర్లపాడు గ్రామ వ్యాపార కూడలిలో కిరాణా,ఐరన్,వస్త్ర దుకాణాల వద్ద మూటలు మోసే హమాలీ కార్మికుల కూలీ ధరలు పెంచి రెండు సంవత్సరాలు గడిచిందని ఒప్పందo గడువు ముగిసిందని జూలై నెల 26 వ తేది నాటికి కూలీ ధరలు పెంచాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో యాజమాన్యాలకు నోటీసులను హమాలీ కార్మికులు అందజేశారు. గురువారం నాడు ముందుగా కార్మికుల అడ్డా నుండి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ తో కలిసి యాజమాన్యాల వద్దకు వెళ్ళారు. అనంతరం మల్లూరు మాట్లాడుతూ యాజమాన్యాలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. చర్చలు జర్పకుంటే జూలై 26 తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యాలకు తెలిపామని మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆల్ హమాలీ సంఘం అధ్యక్షులు పర్సా అప్పారావు,గజ్జెల్లి వెంకటేష్,సత్యం,పాపారావు,రామారావు,నడ్డి ప్రసాద్,గోపి,నాగేశు,శ్రీను,బజారు,వీరయ్య,కృష్ణ,నాగు,రమేష్,జోజీ తదితరులు పాల్గొన్నారు.