- పదవ తరగతి హలో పదిహేనుకు పదిహేను మంది పాస్
- ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
వేంసూరు,ఆగస్ట్ 15 (జనవిజయం): మండల పరిధిలోని కల్లూరుగూడెం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువులకు ఎస్.ఏమ్.సి. కమిటి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గత విద్యా సంవత్సరంలో తమ పాఠశాలలో పదవ తరగతిలో విద్యనభ్యసించిన 15 మంది విద్యార్థులు పాస్ అవ్వడానికి, విద్యార్థులలో చైతన్యం నింపేందుకు కృషి చేసినందుకు కృతజ్ఞతగా అభినందన సభ ఏర్పాటు చేశారు.
మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లంచర్ల వెంకటేశ్వరరావుకు ఎస్.ఏమ్.సి. చైర్మన్ ఖమ్మంపాటి మల్లయ్య శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులకు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సన్మానాలు చేశారు.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులుగా మాత్రమే కాకుండా వేంసూరు, పెనుబల్లి మండలాల తాత్కాలిక విద్యాశాఖాధికారిగా పని చేస్తూ తన పాఠశాలకు మంచి పేరు వచ్చేలా చల్లంచర్ల చేసిన కృషి అనిర్వచనీయమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,ప్రజలు పాల్గొన్నారు.