జనవిజయంతెలంగాణగులాబీదళం నుంచి వేరుపడ్డ ఈటెల

గులాబీదళం నుంచి వేరుపడ్డ ఈటెల

  • ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా
  • ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా?
  • అది ప్రగతిభవన్ కాదు..బానిస భవన్
  • ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోం
  • ఉద్యమంలో సంఘాలు కావాలి…. ఇప్పుడ మాత్రం వద్దు
  • సింగరేణి సంఘంలో కవితకు ఏం పని
  • బి ఫామ్ ఇస్తే కవిత ఓడిపోలేదా?
  • ఉద్యామన్ని నమ్ముకుని వచ్చాం ..పదవులు ఉద్యమంతోనే వచ్చాయి
  • మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ వెల్లడి

హైదరాబాద్, జూన్ 4(జనవిజయం): పొమ్మనలేక పొగపెట్టిన కారణంగా.. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గులాబీ దళంతో తనకున్న అనుబంధాన్ని తెంచుకున్నారు. 19 ఏళ్ల ఉద్యమ పార్టీతో ఇక సంబంధాలను వదులకున్నారు. గులాబీ బాస్ తో పెరిగిన అంతరం కారణంగా ఆయన ఇక ఆ పార్టీలో కొనసాగనని తేల్చేశారు. అర్థంతరంగా, వివరాలు కోరకుండానే తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆగ్రహం చెందిన ఈటెల రాజేందర్ ఎట్టకేలకు శుక్రవారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాత్రికి రాత్రే తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని.. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఓ అనామకుడు లేఖ రాస్తే ఆగమేఘాల మీద మంత్రి మీద విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కనీసం తనను వివరణ కూడా అడగలేదన్నారు. హుజురాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నాం. ప్రాణం ఉండగానే నన్ను బొందపెట్టాలని ఆదేశాలిచ్చారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్ ప్రజలు చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడూ పాకులాడలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని ఈటల రాజేందర్ అన్నారు. అది ప్రగతిభవన్ కాదు.. బానిస భవన్’ అంటూ ఈటల విమర్శలు గుప్పించారు. సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ ఒక్కరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

రూ.వందల కోట్లు ఇన్ కంట్యాక్స్ కట్టేవారికి రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా. హరీష్ రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆకలినైనా భరిస్తాం.. ఆత్మ గౌరవాన్ని వదులుకోమన్నారు. కేసీఆర్ హయాంలో మంత్రులకు , అధికారులకు స్వేచ్ఛ లేదని ఈటల అన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా తనతోపాటే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈటల తెలిపారు. జరిగిన అవమానంతో 19 ఏళ్ల తెరాన అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్ పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు.

అప్పుడు కేసీఆర్ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా. ప్రగతి భవన్ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పా. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. నల్గొండ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఈటల వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీలో తనతో పాటు మంత్రి హరీష్ రావు సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సంక్షేమ పథకాలను ఏనాడు వ్యతిరేకించలేదు. వందల కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్లకు రైతు బంధు ఇవ్వొద్దని చెప్పిన. అది చెప్పడం తప్పేలా అవుతుంది? బెంజ్ కార్లలో తిరిగే వాళ్లకు కూడా రైతు బంధు ఇస్తున్నారు.

నయీం లాంటి వ్యక్తులు చంపుతానని బెదిరించినా తెలంగాణ జెండా వదలలే. ఆర్థిక మంత్రిగా టీఎన్జీవోలు నన్ను కలిస్తే అవహేళన చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిసంఘం నేను పెట్టిస్తే దాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్ కూతురు కవిత నడుపుతోంది. అందులో కవితకు ఏం పనని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మిక సంఘాన్ని నేను, హరీష్ రావు పెట్టిస్తే… కవితకు అప్పగిస్తున్నారు. ఏ సంఘానికి ఈ రోజు హక్కులు లేవు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇవి మేము అడుగొద్దా? పెన్షన్లు సీఎంకు చెప్పి ఇప్పిస్తా అని చెప్పడం తప్పా? ఐకేపీ సెంటర్లు ఉంటాయ్.. ధాన్యం కొంటాయ్ అని చెప్పడం తప్పా? రోషంగల బిడ్డను కాబట్టే ఆనాడు టీఆర్ఎస్ లో చేరినా. మంత్రి పదవి ఇచ్చి బానిస బతుకు బతకమంటే సాధ్యమా? నీవు లల్లు, మాయావతిలాగా పెట్టిన పార్టీ కాదు. వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. అందర్ వాలే బాహర్, బాహర్ వాలే అందర్ అన్నట్లుగా ఉందని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘నిన్ను చంపుతా అన్న వారు వచ్చి నా పక్కన కూర్చున్నారు. నాకు మన్క కొడితే పదవి ఇవ్వలేదు. ఆలె నరేంద్ర, విజయశాంతిని నాలానే పంపించారు. మంత్రులకు, అధికారులకు స్వేచ్ఛ లేదు. నక్సలైట్ అజెండా అని చెప్పిన వారు వరవరరావును జైల్లో పెడితే ఎందుకు మాట్లాడలేదు? మంత్రుల మిదే నమ్మకం లేకపోతే నాలుగు కోట్ల ప్రజలను అడిగే హక్కు ఎక్కడిది? అప్పటి ఒక దళిత ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ ఆయనది.. సహాయం అడిగితే చేయొద్దని ఆదేశించారు. ఆ దళిత మాజీ ఎమ్మెల్యే ఎరో కూడా ఎప్పుడు చెప్పమన్నా చెప్పేందుకు నేను సిద్ధం అని ఈటల పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రజలు కుట్రలు చేదిస్తాం అంటున్నారు. నాకు పదవి ఇవ్వలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇజ్జత్ తక్కువ బతుకు వద్దని నా ప్రజలు చెబుతున్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.

తన సొంత కూతురుకు బీ ఫామ్ ఇచ్చినా ఓడింది. బీ ఫారం ఇస్తే నేను ఎప్పుడూ ఓడకుండా గెలిచినా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తనకు వచ్చిన గ్యాప్ ఇవాళ రాలేదని.. ఐదేళ్ల క్రితమే వచ్చిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యమ నాయకులను గెలిపించిన చరిత్ర కరీంనగర్ జిల్లాకు ఉంది. కేసీఆర్ కుట్రలు, డబ్బు, అణిచివేతను నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. ఉప ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవచ్చు.. గ్యాప్ ఇవాళ రాలేదు.. ఐదేళ్ల క్రితమే వచ్చింది. హరీశ్ రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేలం అందరం వెళితే గేట్ దగ్గరే ఆపేశారు. రెండోసారి అపాయింట్ మెంట్ తీసుకుని పోయాం. రెండోసారి కూడా గేట్ల నుంచే బయటకు పంపించారు. మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్ ను అడిగాను. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అని పేరు పెట్టుకోవాలని చెప్పా. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో సంఘాలు కావాలి.. ఇప్పుడు సంఘాలు వద్దా? బొగ్గు గనులతో సంబంధం లేని వ్యక్తులు ఆ సంఘాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఈటెల మాట్లాడుతున్నంత సేపు వందలాదిగా వచ్చిన అభిమానులు, నాయకులు ఆయన వెన్నంటి ఉన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి