Tuesday, October 3, 2023
Homeవార్తలుగ్రీన్‌ ఫీల్డ్‌ హైవే అలైన్మెంట్‌ మార్చాలి

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే అలైన్మెంట్‌ మార్చాలి

  • అక్రమంగా అరెస్టు చేసిన నిర్వాసిత రైతులను, సిపిఎం నాయకులను వెంటనే విడుదల చేయాలి
  • భూనిర్వాసిత రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
  • అక్రమ అరెస్టును ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
ఖమ్మం, ఆగస్ట్‌ 12 (జనవిజయం) : భారత ప్రభుత్వం  జాతీయ రహదారి నిర్మాణం కోసం నాగపూర్‌ టు అమరావతి పేరుతో భూసేకరణ చేస్తున్నది. ఇందులో ఖమ్మం అర్బన్‌ మండలంలో ఉన్న అనేక గ్రామాల రైతులు 266ఎకరాల  వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న సారవంతమైన విలువ గల భూములను రైతులు కోల్పోతున్నారు. రైతుల నుండి ప్రభుత్వం తక్కువ ధర ప్యాకేజీ ప్రకటించి తీసుకోవాలని చూస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు ఆరోపించారు. శనివారం ఖమ్మం నగరంలోని నిర్మల్‌ హృదయ్‌ స్కూల్‌ సెంటర్‌ లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యతన జరిగింది.
గతంలో పార్టీ ఆధ్వర్యంలో అలైన్‌ మెంట్‌ మార్చాలని, కొత్త అలైన్మెంట్‌ చేసి, ప్యాకేజీ ప్రకటించి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రైతులకు వ్యతిరేకంగా పాత అలైన్‌ మెంట్‌ ప్రకారం బలవంతపు భూసేకరణకు ఈ రోజు ఉదయం సర్వే చేస్తుండగా అధికారులను భూనిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. వారికి అండగా ఉన్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, బొంతు రాంబాబు, పార్టీ జిల్లా కమిటీ సభ్యలు నవీన్‌ రెడ్డితో పాటు రైతులను పోలీసులు  అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించటం అన్యాయమని ఆయన విమర్శించారు. ఈ చర్యలను సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన చెప్పారు.
2013 చట్టం ప్రకారం మార్కెట్‌ విలువ కంటే మూడు రెట్లు అధికంగా కేటాయించి భూమి విలువ కట్టి ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్‌ చేసారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విన్నపాలు పట్టించుకోకుండా పాత అలైన్మెంట్‌ ప్రకారం సర్వేలు చేసి రైతులకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి వలన రైతులు భూములను కోల్పోయి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. వెంటనే ప్రభుత్వం కొత్త అలైన్మెంటు  ప్రకటించి భూ నిర్వాసిత రైతులకు మెరుగైన ప్యాకేజీ అందించి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కార్యవర్గ సభ్యులు వై విక్రమ్‌, భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్‌, ఎర్ర శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, నందిపాటి మనోహర్‌, ఎస్‌ కే బషీర్‌, ఆర్‌. ప్రకాష్‌, జిల్లా నాయకులు మెరుగు రమణ, మద్దెల ప్రభాకర్‌, చింతల రమేష్‌, నాయకులు గౌస్‌, బొడపట్ల సుదర్శన్‌, పగడాల నాగేశ్వరరావు, బత్తిని ఉపేందర్‌, జిల్లా ఉపేందర్‌, బీబీ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments