జనవిజయంతెలంగాణగ్రామ పంచాయితీలలో సత్వరమే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి - ఖమ్మం కలెక్టర్ ఆదేశం

గ్రామ పంచాయితీలలో సత్వరమే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి – ఖమ్మం కలెక్టర్ ఆదేశం

ఖమ్మం, మే22 (జనవిజయం) : జిల్లాలో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న గ్రామ పంచాయితీలలో సత్వరమే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. కామేపల్లి, కారేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకోసం వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు పాటించాలని తమతో పాటు తమ కుటంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం పాజిటివ్ పేషెంట్లు క్వారెంటైన్ కేంద్రాలలో వైద్య చికిత్స పొందాలని కలెక్టర్ సూచించారు. రోగనిర్ధారణ పరీక్షల నిమిత్తం వచ్చే వారి కోసం కనీస సదుపాయాలు సమకూర్చాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. కామేపల్లి మండలంలో అత్యధిక కేసులు నమోదవుతున్న గ్రామ పంచాయితీలలో సత్వరమే క్వారెంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలలో క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, పాజిటివ్ పేషెంట్లను -క్వారెంటైన్ కేంద్రాలకు తరలించాలన్నారు. స్థానిక సర్పంచ్, పంచాయితీ కార్యదర్శిల భాగస్వామ్యంతో క్వారెంటైన్ కేంద్రాలలోని పేషెంట్లకు భోజన, వసతి సమకూర్చే బాధ్యతలను ఎం.పి.డి. ఓలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో లా డౌన్ కఠినంగా అమలు చేయాలని స్టేషన్ హౌజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని మాన్లు తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటించాలని సడలింపు సమయం దాటిన పిదప గ్రామాలలో బయట జనసమూహం ఉండరాదని నిరంతర మోబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో కట్టడి చర్యలు పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. కామేపల్లి, కారేపల్లి తహశీల్దార్లు డి.ప్రసాద్, పుల్లయ్య, ఎం.పి.డి.ఓలు సిలార్ సాహెబ్, రమాదేవి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చందన, డాక్టర్ హన్మంతరావు, సర్పంచ్ రాందాస్ నాయక్, ఎం.పి.పి మాళోతు శకుంతల, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి