జనవిజయంతెలంగాణగ్రామాల్లో పెరిగిన పారిశుద్య అవగాహన

గ్రామాల్లో పెరిగిన పారిశుద్య అవగాహన

  • పల్లె ప్రగతి కార్యాక్రమాలతో చైతన్యం కరోనాతో మరింత అప్రమత్తం అవుతున్న జనం

వరంగల్,జూన్ 9(జనవిజయం): తెలంగాణలో ఇటీవలే పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసింది. ప్రజలను చైతన్యం చేసేలా పారిశుద్యం, పచ్చదనంపై అవగాహన కలిగించారు. పంచాయితీరాజ్ గ్రామాణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక శ్రద్ధతో ఊరూవాడను కదిలించ గలిగారు. దీంతో పారిశుద్యంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. ప్రధానంగా పారిశుధ్య పనులు చేపట్టి ప్రజలకు మంచి వాతావరణం అందించాలని ముందుకెళ్తున్నది. కరోనా వేళ పల్లె ప్రాంతాల్లో ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగామన పెరిగింది. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనుకునే అలవాటు వచ్చింది. అయితే నాయకులు, అధికారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ప్రజలను భాగస్వాములను చేయలేకపోయారు. దీనికి కరోనా కూడా కారణంగా చెప్పాలి. ఇది నిరంతర కార్యక్రమం కనుక ప్రతి గ్రామానికి, వార్డుకు బాధ్యత అప్ప గించాలి. ఒక్కోవార్డు మెంర్ తన వార్డులో పారిశుద్యానికి బాధ్యులగా చేస్తే తప్ప ఇది విజయవంతం కాదు. ఇదిలావుంటే ప్రతి గ్రామంలోనూ సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఒక్కో దానికి రూ.2 లక్షల నిధులు కేటాయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించి చైతన్యం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నులభ్ కాంప్లెక్సుల తరహాలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ వీటిని నిర్మించాలని భావించాయి. నిర్మాణ వ్యయంలో పంచాయతీలు పది శాతం నిధులు మాత్రమే భరించాలని నిబంధలనలు పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ముందుకు వచ్చాయి. పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పంచాయతీకి సామూహిక మరుగుదొడ్లు నిర్మించేందుకు కొత్త ప్రణాళిక రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. అనేక గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో పంచాయతీ నుంచి రూ.2లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళిక తయారు చేశారు. పంచాయతీలో ఇంటింటికీ మరుగుదొడ్డి ఉన్నప్పటికీ ఇంకా నిర్మించుకోని వారికి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వారికి ఈ సులభ్ కాంప్లెక్స్ ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్వచ్ఛభారత్ మిషన్ను సద్వినియోగం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సామాజిక మరుగుదొడ్లు నిర్మించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. బహిరంగ మల, మూత్ర విసర్జనకు స్వన్ని పలికేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో మరుగుదొడ్లను నిర్మిస్తున్నాయి. గ్రామాల్లో సామాజిక మరుగుదొడ్లు, మూత్రశాలలు సైతం నిర్మించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. వీటి నిర్మాణం అనంతరం ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చనున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిండంతో నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2 లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 30 శాతం, మిగిలిన 10 శాతం పంచాయతీ భరించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లా గ్రామాణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాలు జరుగనున్నాయి. వీటి అవసరాన్ని ఆయా పంచాయతీల పాలకవర్గాలకు పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు వివరిస్తున్నారు. పంచాయతీ కార్యాలయం లేదా బస్టాండ్, జన సమూహం ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో వీటిని నిర్మించనున్నారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు చొప్పున మూత్రశాలలు, మరుగుదొడ్లను వేర్వేరుగా నిర్మించనున్నారు. వాటిని నిర్మించుకునేందుకు జిల్లాలో మండల కేంద్రాల పంచాయతీలు, ఇతర మేజర్ పంచాయతీలు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి