జనవిజయంతెలంగాణఐదు కంటే ఎక్కువ కేసులు నమోదైన గ్రామాలలో స్పెషల్ క్యాంపులు - ఖమ్మం కలెక్టర్ కర్ణన్

ఐదు కంటే ఎక్కువ కేసులు నమోదైన గ్రామాలలో స్పెషల్ క్యాంపులు – ఖమ్మం కలెక్టర్ కర్ణన్

ఖమ్మం, జూన్6 (జనవిజయం) : గ్రామాలలో పాజిటివ్ రేటును తగ్గించే దిశగా మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మధిర మండలం మాటూరు పేట పి.హెచ్.సిని కలెక్టర్ సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టెస్టులను పెంచాలని దీనితోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఇంటింటి సర్వే నిరంతరం కొనసాగిస్తూ పాజిటివ్ పేషెంట్లను గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని, పాజిటివ్ పేషెంట్లకు ఐసోలేషన్ కేంద్రాలలో మెరుగైన వైద్య సదుపాయాలు, ఉచిత భోజన వసతి కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఐసోలేషన్ కేంద్రాలలోని పేషెంట్లను ప్రతిరోజు ఉదయం సాయంత్రం పర్యవేక్షించాలని తద్వారా గ్రామాలలో పాజిటివ్ పూర్తిగా తగ్గించాలని మండలస్థాయి అధికారులను, వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా ఐదు కంటే ఎక్కువ కేసులు నమోదైన గ్రామాలలో స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మాటూరు పేట ఏపీ తెలంగాణ సరిహద్దులో బార్డర్ చెక్ పోస్ట్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కేవలం అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన వాహనాలను, అధికారికంగా ప్రత్యేక పాసులు కలిగిన వాహనాలను మాత్రమే అనుమతి చాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లాక్ డౌన్ సడలింపు సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితులలో జనసంచారం రోడ్లపై ఉండరాదని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సరిహద్దు ప్రాంతంలో నిఘాను మరింత పెంచి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

అంతకుముందు మధిర ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ సింట్రల్ లైన్ ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి, ఎస్ఆర్ద్ పేరెంట్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన ఆక్సిజన్ 4 కాన్సెంట్రేటర్లను వారు మధిర ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడుగా సత్య సేవా సమితి, ఎస్ఆర్ఐ పేరెంట్స్ చేపట్టే సహాయ కార్యక్రమాలను అభినందించారు .

తదనంతరం బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో టెస్టుల కొరకు వచ్చే వారి కోసం కనీస సదుపాయాలు నీడ, త్రాగునీరు, కూర్చునే ఏర్పాట్లు సమకూర్చాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. మండల పరిధిలో మండల స్థాయి అధికారుల బృందం ప్రతి గ్రామాన్ని సందర్శించి పాజిటివ్ పేషెంట్లను గుర్తించి వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకై ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తూ విస్తృతంగా అవగాహన కల్పించాలని తద్వారా గ్రామాలలో పాజిటివ్ పూర్తిగా తగ్గించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి, వైరా ఏ సి పి సత్యనారాయణ, మధిర తాసిల్దార్ సైదులు, ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి , ఎంపీపీ మొండెం లలిత , మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, సేవా సమితి సభ్యులు సుధాకర్, మురళి, కోన మోహన్ రావు, డాక్టర్ అనిల్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు .

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి