- జనసేన పార్టీ ముదిగొండ మండల అధ్యక్షులు జొన్నలగడ్డ భద్ర
- ముదిగొండలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు
ముదిగొండ,జులై19(జనవిజయం):
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 14రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం స్పందించి డిమాండ్ల పరిష్కారించేదుకు సమ్మెను ఉధృతం చేయాలని జనసేన పార్టీ ముదిగొండ మండల అధ్యక్షులు జొన్నలగడ్డ భద్ర తెలిపారు. ముదిగొండ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని కోరారు. పిఆర్సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ రు.19,000/- లు చెల్లించాలన్నారు. ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం పేపర్లకు రు.15,600 పంప్ ఆపరేటర్లకు ఎలక్ట్రిషన్లకు డ్రైవర్లకు కారో బార్ బిల్ కలెక్టర్లకు రు.19,500 నిర్ణయించాలని కోరారు. జీవో నెంబర్ 51 సవరించాలని, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, పాత క్యాటగిరీని అన్నిటినీ అదే విధంగా కొనసాగించాలని, ప్రమాదం జరిగిన మరణించిన సిబ్బంది కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల సిబ్బంది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దృష్టి తీసుకెళ్లి ఒక నివేదిక ఇచ్చి గ్రామాల సిబ్బంది 50 వేలు మందికి జనసేన అండగా ఉంటుందని వారు రాబోయే రోజుల్లో ఏ కార్యాచరణ తీసుకున్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, మహిళా సంఘం సెక్రెటరీ పద్మ, వెంకయ్య, రాయభారాపు కళ్యాణ్ తో, పాటుగా వివిధ పార్టీ నాయకులు,ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ కార్మికులు, పాలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.