బోనకల్, జూలై 17(జనవిజయం) :
మండలంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మల్టీ పర్పస్ వర్కర్స్ కి.సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిసిసి మెంబర్ పైడిపల్లి కిషోర్ జెడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా పైడిపల్లి కిషోర్ కుమార్ మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా పోరాటంలో అండగా ఉంటాం అని తెలియజేశారు.కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న ఉద్యోగులను అందరినీ పర్మినెంట్ చేస్తాం అని హామీ ఇచ్చిన బీఆరెఎస్ ప్రభుత్వం హామీలు నీటిమూటలయ్యాని , గ్రామాల్లో అన్ని విధాలా సేవలు అందిస్తున్న పంచాయితీ మల్టీ పర్పస్ వర్కర్స్ కోరుతున్న న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అనంతరం వారికీ అయిదు వేల రూపాయలు అర్దిక సహయం అందించారు.కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి బంధం నాగేశ్వరరావు జెడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.