పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి
- ఆమ్ ఆద్మీ పార్టీ వైరానియోజికవర్గం ఇన్చార్జి బాబూలాల్ పవార్
కొణిజర్ల, జులై 28 (జనవిజయం): పంచాయతీ కార్మికుల ఉద్యోగాలు ఉన్న నేను పర్మినెంట్ చేసి, వారికి ఉద్యోగ భద్రత ను కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ వైరానియోజికవర్గం ఇన్చార్జి బాబూలాల్ పవార్ డిమాండ్ చేశారు.శుక్రవారం కొణిజర్ల మండలకేంద్రంలో 23వరోజు పంచాయతీ కార్మికుల సమ్మె కు మద్దతుగా దీక్షా శిబిరం లో ఆయన ప్రసంగించారు.ప్రజలపారిశుద్యంకోసం పనిచేసే కార్మికులకు వేతనాలు సరిగా ఇవ్వకపోతే ప్రభుత్వం మరి ఎవరికి ఇస్తుందని ప్రశ్నించారు.వీదిలో చేత్తోనే కాదు! పాలకుల మెదడులో పేరుకున్న చెత్తను తమ పోరాటం ద్వారా శుభ్రం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఎన్నికల్లో కూడా ప్రజలు డబ్బులు పంచే అభ్యర్థుల కు ఓటువేయడం అనర్థాలకు కారణం, సేవ చేసే అభ్యర్థుల కు అవకాశం లభించడం లేదని అన్నారు.డిల్లీలో కేజ్రీవాల్ ప్రమాదంలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కు కోటిరూపాయలు ఎక్సగ్రేషియా ఇస్తున్నారు.ముఖ్యమంత్రిప్రమాణస్వీకారంకు పారిశుద్ధ్య కార్మికులు నే అతిథులుగా ప్రమాణస్వీకారం కేజ్రీవాల్ చేశారని అన్నారు.ఆఫ్ జిల్లా కార్యదర్శి రైతునేత స్వర్ణ సుబ్బారావు మాట్లాడుతూ కార్మికుల పోరాటం కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.పొరాటం ద్వారా మనసమస్యనే పరిష్కారం అవుతుంది అన్నారు.ఆప్ కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు తదితరులు కార్మికుల కు మద్దతుగా దీక్షా శిబిరం లో ప్రసంగించారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్మికుల నేతలు గరిడేపల్లి భాస్కర్, సుధాకర్ రెడ్డి, నల్లమోతు నరేష్,వడ్డాణపురవి ,దొడ్డనరేష్ తదితరులు పాల్గొన్నారు.