Tuesday, October 3, 2023
Homeవార్తలుసమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు బిజెపి భరోసా

సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు బిజెపి భరోసా

  • పంచాయతీ కార్మికులపై కక్ష సాధింపు తగదు, కెసిఆర్ నిరంకుశత్వం వీడాలి : నెల్లూరి
  • కార్మికుల కుటుంబాల బ్రతుకులతో కెసిఆర్ చెలగాటం, సిబ్బంది డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి: బీపీ నాయక్

వైరా, జూలై 15,(జనవిజయం):

నియోజకవర్గంలోని ఏన్కూరు, వైరా మండల కార్యాలయం వద్ద గత పది రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని, కార్మికుల శిబిరాన్ని సందర్శించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. సమ్మె చేస్తున్న పంచాయతీ సిబ్బంది చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో కార్మికులతో కలిసి నిరసనను తెలియజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బీపీ నాయక్, వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొవ్వూరి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ ఇతర ముఖ్య నాయకులు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతిరోజు బ్రతుకు కోసం, ఆత్మగౌరవం కోసం కొట్లాట జరుగుతూనే ఉందని. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అవినీతి ఊబిలో దింపారని, దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉద్యోగస్తులకు కార్మికులకు సరైన జీతాలు ఇవ్వకుండా నరకయాతన చూపిస్తున్నారన్నారని, పల్లెలను పట్టణాలను ప్రతిరోజు శుభ్రం చేసే గ్రామపంచాయతీ సిబ్బందుల పట్ల వారి డిమాండ్ల పట్టించుకోకుండా ఈ గుడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుతో నిరంకుశ ధోరణి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. పంచాయతీ కార్మికులందరూ కష్టపడితేనే జాతీయ స్థాయిలో గ్రామపంచాయతీ లకు, రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయని. అయినా వారి కష్టాన్ని గుర్తించకుండా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని అవలంబిస్తూ శ్రమదోపిడి చేస్తున్నారని, వారికి గౌరవ వేతనం ఇవ్వకుండా కనీస గౌరవం ఇవ్వకుండా వెట్టిచాకిరీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. వారికి వెంటనే గౌరవ వేతనాన్ని 20000 రూపాయలను అందించాలని, పంచాయతీ కార్మికులందర్నీ వెంటనే పర్మినెంట్ చేయాలని, జీవిత కనీస బీమా కల్పించాలని, గౌరవార్థం వాళ్ళందర్నీ పంచాయతీ సహకార్యదర్శి, పంచాయతీ సిబ్బందులుగా మార్చాలని, పని గంటల సమయాన్ని ఎనిమిది గంటలకు కుదించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నల్లమోతు రమేష్, కోసూరి గోపాలకృష్ణ, ఏలే భద్రయ్య, జిల్లా నాయకులు నరుకుల వెంకటేశ్వరరావు, నల్లగట్టు ప్రవీణ్, దుద్దుకూరి కార్తీక్, మండలాల ప్రధాన కార్యదర్శిలు వెంకటకృష్ణ, దోసపాటి కళ్యాణ్, గుగులోతు శశికిరణ్, ఈసం రమేష్, దిలీప్ ఆర్య, కంకణాల రాంబాబు, శాఖమూడి నాగేశ్వరరావు, వెంకట్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments