Tuesday, October 3, 2023
Homeవార్తలుచాలీచాలని జీతంతో బ్రతుకు వెళ్లదీస్తున్న పంచాయతీ కార్మికులు

చాలీచాలని జీతంతో బ్రతుకు వెళ్లదీస్తున్న పంచాయతీ కార్మికులు

  • పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం
  • సర్పంచ్ హయంలో వారి కష్టాలు దగ్గరుండి చూశాను: మాజీ సర్పంచ్ వజీర్

బోనకల్ జూలై 19,(జనవిజయం):

మండల పరిధిలోని పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గత 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.కార్మికులు చేస్తున్న దీక్షకు మండలంలోని ప్రజాప్రతినిధులు పలు సంఘాల నాయకులు వారి సమ్మెకు సంఘీభావం తెలిపి,భోజనం ఖర్చుల నిమిత్తం విరాళాలు ఇవ్వడం జరిగింది.బుధవారం స్థానిక ఎస్ ఆర్ గార్డెన్ లో అఖిలపక్ష నాయకులు పాల్గొని వారి యొక్క న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరడం జరిగింది.

అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న రావినూతల గ్రామ మాజీ సర్పంచ్ వజీర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందని,వారు కోరేటువంటి ప్రతిదీ న్యాయమైన డిమాండ్ అని ఈ సందర్భంగా తెలియజేశారు. పంచాయతీ కార్మికులు చేసే పనిని వారు గడిపేటువంటి జీవితాన్ని ఒక్కరోజు ముఖ్యమంత్రి గానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గాని ఒకరోజు గ్రామంలో తిరిగి వారి చేసేటువంటి పనులను చూస్తే వారి బాధలు ఏంటో కష్టాలు ఏంటో అర్థం అవుతాయని బాధతప్త హృదయంతో తెలిపారు. గతంలో తాను గ్రామ సర్పంచ్ గా పనిచేశానని వారి జీవితాలను దగ్గరుండి చూశానని ప్రస్తుత సమాజంలో రోజువారీ వేతనం 700వందలు రూపాయలు ఇస్తున్నారని ప్రభుత్వం ఇచ్చే 313రూపాయలు వారికీ ఏ మూలన సరిపోతాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆయన అఖిలపక్ష సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments