పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ
బోనకల్, జూలై 21(జనవిజయం):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ కార్మికులు పద హరవ రోజు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ మధిర అసెంబ్లీ ఇంఛార్జి గంధం పుల్లయ్య ఆప్ నాయకులు మండల కేంద్రములో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ కార్మికుల శ్రమ దోపిడీ కి గురి అవుతున్నారని, పంచాయితీ కార్మికులకు ముల్టిపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని,అదే విధంగా జి.ఓ నెం.51 రద్దు చేయాలని ,కార్మికులకు ప్రమాద భీమా వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలని,వారి యొక్క జీవనోపాధికి తోడ్పడే విధంగా రెగ్యులర్ చేయాలని,సమ్మె లో బాగంగా ఏవైతే వారు కోరే న్యాయమైన డిమాండ్లను సత్వరమే పర్శ్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు పంచాయితీ కార్మికులు పాల్గొన్నారు.