- ఎమ్మెల్యే కి వినతి
భద్రాచలం, జూలై 18 (జనవిజయం):
భద్రాచలంలో పంచాయతీ కార్మికులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. 13 రోజులు గా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం స్పందన లేదని కార్మికులు విమర్శించారు. ప్రభుత్వ మొండి వైఖరి ని నిరసిస్తూ నినాదాలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే పొ దెం వీరయ్య కు తమ సమస్యల తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నినాదాలు చేసారు.కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టి కి తీసుకెళ్లాలని సీఐటీయూ, ఏఐటియుసి నాయకులు ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేసేరు. వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే వీరయ్య పంచాయతీ కార్మికుల సమ్మె న్యాయమైందని వారు కనీస వేతనమే కోరుకుంటున్నారని, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో సిఐటియు నాయకులు ఏం. బాల నర్శారెడ్డి, మర్లపాటి రేణుక, గడ్డం స్వామి, బి.వెంకట రెడ్డి, వై. వెంకట రామారావు, ఏఐటియుసి నాయకులు ఏ.సునీల్ తదితరులు పాల్గొన్నారు.