భద్రాచలం, జూలై 16, (జనవిజయం):
తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తెల్లం వెంకటరావు ఆదివారం సంఘీభావం తెలిపారు. భద్రాచలం పంచాయతీ లో గత పదకొండు రోజులనుండి నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులు సుమారు వంద మందికి సంఘీభావం గా తెల్లం వెంకటరావు భోజనం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసేరు. ఈ కార్యక్రమంలో జె పి ఎస్ రాష్ట్ర నాయకులు రాయపూడి యేసు రత్నం పాల్గొన్నారు.