- మృతదేహంపై ఎర్రజెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటింటించిన సిపిఐ నాయకులు
- అంతిమ యాత్రలో పాడేమోసిన కూనంనేని, సాబీర్ పాషా
కొత్తగూడెం, ఆగస్ట్ 18 (జనవిజయం): బొగ్గుగని కార్మిక మాజీ నేత, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ కేంద్ర కమిటి ప్రధాన కార్యదర్శి యూనియన్ కొమరయ్య కుమారుడు మనుబోతుల గోవర్ధన్కు సిపిఐ, ఏఐటియుసి శ్రేణులు కన్నీటి విడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాదపడుతూ గురువారం ఆయన సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో మృతిచెందగా అంత్యక్రియలు పట్టణంలోని రైటర్ బస్తిలో సందర్శనార్ధం ఉంచారు. శుక్రవారం జనసందోహం నడుమ గోపి అంతిమయాత్ర జరిగింది. తొలుత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర నాయకులు గోపి మృతదేహంపై పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలే నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంతాపసభలో కూనంనేని మాట్లాడుతూ మనుబోతుల కుటుంబం కార్మిక, ప్రజా సేవకు అంకితమయ్యారని, బొగ్గుగని కార్మిక నేతగా కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిన కొమరయ్య తనయుడిగా గోవర్ధన్ తండ్రి ఆశయాలకు అనుగుణంగా కార్మికవర్గానికి సేవలందించారని, సింగరేణి సంస్థలో అధికారి హోదాలు ఉన్నప్పటికి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేశాడని కొనియాడారు. గోవర్ధన్ బార్య శైలజ వైద్యురాలిగా ఈ ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. కొమురయ్య, గోపీనాధ్ ఆశయాల సాధనకోసం పార్టీ, యూనియన్ శ్రేణులు పునరంకితం కావాలని కోరారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, మిర్యాల రంగయ్య, కె.రాజకుమార్, బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, ముత్యాల విశ్వనాధం, దుర్గరాశి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, వట్టికొండ మల్లికార్జున్రావు, గనిగళ్ళ వీరస్వామి, వంగా వెంకట్, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, బరిగెల సంపూర్ణ, బానోతు గోవిందు, గెద్దాడు నగేష్, కె.రత్నకుమారి, బానోతు గోవిందు, జె.గట్టయ్య, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు బరిగెల భూపేష్, కొచ్చెర్ల జోసఫ్, కొరిమి సురేష్, జేర్పుల ఉపేందర్ సిపిఎం, కాంగ్రేస్, టిజెఎస్, టిఆర్ఎస్ నాయకులు, అనుబంద కార్మిక సంఘాల ఉన్నారు.