జనవిజయంఅంతర్జాతీయంగూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? జూన్ 1 నుండి జాగ్రత్త!

గూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? జూన్ 1 నుండి జాగ్రత్త!

ఫోన్లో స్టోరేజ్ సమస్యలేకుండా ఈమధ్యకాలంలో అందరూ గూగుల్ ఫోటోస్ ఉచిత సర్వీసు లోకి బ్యాకప్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు బాగానే వుంది, కానీ రేపటినుండి (01.06.2021) నుండి ఈ సర్వీసు పూర్తిగా ఉచితం కాదు. కేవలం 15 జీబీ వరకు మాత్రమే ఫ్రీ. ఆ తర్వాత బ్యాకప్ చేసుకోవాలంటే నెలవారీ ఫీజు చెల్లించాలి. నెలకు రూ.130/- లేదా సంవత్సరానికి రూ.1300/- చెల్లించడం ద్వారా 100 జీబీ వరకూ ఫోటోలు/ఫైళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టోరేజ్ మీ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ వంటి అన్ని సర్వీసులకూ చెందుతుంది. మధ్యలో అమౌంట్ పే చేయలేకపోతే కొంతకాలం (ప్రస్తుతానికి 2 సంవత్సరాలు) తర్వాత బ్యాకప్ అయిన ఫోటోలు కూడా డిలీట్ ఆటోమ్యాటిక్ గా డిలీట్ చేయబడతాయి! ఈలోపు పీరియడ్ లో ఇక మీరు జీమెయిల్ లో మెయిల్స్ రిసీవ్ చేసుకోవడం, పంపడం, గూగుల్ డ్రైవ్, ఇతర సర్వీసులను వాడడం కుదరదు.

నిజానికి గూగుల్ తమ ఫోటోస్ సర్వీస్ పెయిడ్ సర్వీస్ క్రిందకు మారబోతోందని గతకొంతకాలంగా చెప్తూ వస్తుంది. తాజాగా ఇక జూన్ 1, 2021 నుండి తప్పనిసరిగా పెయిడ్ సర్వీస్ అని ప్రకటించింది. 80% మంది గూగుల్ ఫోటోస్ యూజర్లు పెయిడ్ ప్లాన్ లేకుండానే తమకు ఉచితంగా వుండే 15 జీబీ స్టోరేజ్ తో మరొక మూడు సంవత్సరాలు ఫోటోలు బ్యాకప్ చేసుకుంటారని అంచనా వేసింది.

ఏదేమైనప్పటికీ గూగుల్ పోటోస్ పెయిడ్ సర్వీస్ గా మారిన తరుణంలో డబ్బులు చెల్లించలేనివారు ఇకమీదట ఈ సర్వీసును ఉపయోగించకపోవడమే ఉత్తమం. తమ ఫోటోలను ఫిజికల్ గా బ్యాకప్ తీసుకునే అవకాశం వున్నవారు హార్డ్ డిస్క్ లలో బ్యాకప్ చేసుకోవడం ఒక ప్రత్యామ్నాయం. అవసరంలేని ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటే చాలావరకు స్టోరేజ్ సేవ్ అవుతుంది. అలాగే, ఈ మధ్యకాలంలో హైరిజల్యూషన్ కేమెరాలతోనే అన్ని ఫోటోలు తీయడంతో స్టోరేజ్ స్పేస్ ఎక్కువగా వినియోగించబడుతుంది. ఫోన్లు, ట్యాబ్లెట్లు, సాధారణ రిజల్యూషన్ గల కంప్యూటర్లు, ల్యాప్టాప్ లకు అంత రిజల్యూషన్ అవసరం వుండదు. సాధారణ రిజల్యూషన్ లోనే అవసరమయిన ఫోటోలను హై రిజల్యూషన్ లో తీసుకోకపోవడం ద్వారా కూడా స్టోరేజ్ చాలావరకు ఆదా అవుతుంది.

ఒకవేళ మీరు ఇప్పటివరకు గూగుల్ ఫోటోస్ కు బ్యాకప్ చేసిన అన్నీ ఫోటోలు, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే takeout.google.com అనే లింకుకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి