రేపు గోదావరి వరద ఉదృతిని పరిశీలించనున్న మంత్రి పువ్వాడ
▪️మంత్రి పువ్వాడకు సీఎం కేసీఅర్ ఆదేశాలు
హైదరాబాద్, జులై 20 (జనవిజయం) :
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఆదేశాలు ఇచ్చారు.
శుక్రవారం (21.07.23) న 11 గంటల నుండి వరద ఉదృతి తగ్గే వరకు భద్రాచలంలోనే ఉండి మంత్రి పువ్వాడ పర్యటించనున్నారు.
మంత్రి పువ్వాడతో పాటు గత కలెక్టర్ అనుదీప్ సైతం భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసి వారికి భరోసా కల్పించనున్నారు.
గత సంవత్సరం జులై నెలలో గోదావరి వరద ఉద్రుతిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు నాలుగు రోజుల పాటు భద్రాచలంలోని మకాం వేసి లోతట్టు ప్రాంతాల నిర్వాసితులను అక్కడ నుండి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించారు.
గత ఏడాది పువ్వాడ అజయ్ కుమార్ వరద ప్రాంతాల్లో పర్యటించిన దృశ్యాలు దిగువ చూడవచ్చు