ఖమ్మం,జులై30(జనవిజయం): జూలై 30 వ తారీకు న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా క్రై – చైల్డ్ రైట్స్ అండ్ యు వారిచే తయారు చేయబడిన గోడపత్రికను బోనకల్ ఎస్ఐ సాయికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా అనేది ముఖ్యంగా నాలుగు రకాలుగా జరుగుతుందని దీనిలో సెక్స్ ట్రాఫికింగ్, అవయవ అక్రమ రవాణా, బలవంతపు లేబర్ మరియు బలవంతపు నేర కార్యకలాపాలు గా జరుగుతుందని తెలియజేశారు. వీటిలో ప్రధానంగా పిల్లలు ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారని అలాంటి పిల్లలను ఎవరైనా ఎక్కడైనా చూసినా గాని వారికి తెలిసిన గాని పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు కాల్ చేయాలని , దాని ద్వారా అక్రమ రవాణాను నిరోధించి పిల్లల హక్కులకు భంగం కలగకుండా పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చిన వారం అవుతాం అని దీనిని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బోనకల్ మండలంలో చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ సహకారంతో ఎఫర్ట్ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాలస్వామి నాదం, కానిస్టేబుల్ ఆనంద్ మరియు ఎఫర్ట్ సంస్థ సిబ్బంది అరుణకుమారి, నరసమ్మ, గురవమ్మ, రాణి తదితరులు పాల్గొన్నారు.