రఘునాధపాలెం, ఆగష్టు 9 (జనవిజయం) : తెలంగాణ కాంగ్రెన్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గిరిజనుల్లో జోష్ నింపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుధవారం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పొంగులేటికి ఘనస్వాగతం పలికారు. ఉత్సవాల్లో భాగంగా గిరిజనులతో కలిసి కోలాట నృత్యం చేసి వారిలో జోష్ నింపారు. వారితో సెల్ఫీలు దిగుతూ.. కరచాలనం చేస్తూ ఉత్సహపరిచారు. గిరిజనుల సంప్రదాయ వంటకాలను అరగించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాబోవు కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనుల సమస్యలన్నింటిని పరిష్కారించేందుకు పార్టీ తరుపున తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.