– విశ్వ విద్యాలయాన్ని సాధించడంలో విఫలం
– గిరిజన బంధు పథకం హామీ బుట్ట దాఖలు
– తెలంగాణ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– ఇల్లందు నియోజకవర్గంలో పర్యటన
– ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా మహనీయులకు నివాళి
ఇల్లందు, ఆగష్టు 9 (జనవిజయం) : గిరిజన ద్రోహి కేసీఆర్ అని… గిరిజన విశ్వ విద్యాలయాన్ని సాధించడంలో కేసీఆర్ విఫలం అయ్యాడని తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఇల్లందు నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య తో కలిసి ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఇల్లందు పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గిరిజన సంప్రదాయ జెండాను ఎగురవేసి కొమరం భీం చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అడువుల విస్తీర్ణాన్ని పెంచే సాకుతో గిరిజనులను పోడుభూముల నుంచి బలవంతంగా తరిమేసాడన్నారు. గిరిజన బంధు పథకం హామీ ను అమలు చేయడంలో విఫలం అయ్యాడని విమర్శించారు. అదే విధంగా 12.49 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వకుండా గిరిజనులను మోసం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆశీస్సులు, దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హాయంలో గిరిజనుల న్యాయ పరమైన డిమాండ్లన్ని సత్వరమే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇల్లందులోని మాణిక్యారం, పోలారం గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కాంగ్రెస్ నాయకులు ముక్తి కృష్ణ, తాటి భిక్షం, కోరం సురేందర్, పూనెం సురేందర్, సాంబ మూర్తి , సూర్యం, డానియల్, పులి సైదులు, సుదర్శన్ కోరి, గణేష్, మోకాల పోచాలు, గడ్డం మధుసూదన్ రెడ్డి, లక్కినేని సాయి, జెమిని వెంకటేశ్వరరావు తదితరులున్నారు.