ఖమ్మం, ఆగస్టు 14(జనవిజయం): ఘర్ ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ హైదరాబాద్ నుండి లక్ష జాతీయ పతాకాలు సోమవారం జిల్లాకు చేరాయి.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇట్టి జాతీయ పతాకాలను ఆవిష్కరించి, జిల్లాలో ఇంటింటికి పంపిణీకి ఆదేశించారు. సోమవారం జిల్లాకు చేరుకున్న జాతీయ పతాకాలను జిల్లాలోని మునిసిపాలిటీలు, ఖమ్మం రూరల్ మండలంలో పంపిణీకి చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డి. మధుసూదన్ నాయక్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.