- కలెక్టర్ కు పూర్వ విద్యార్ధుల వినతి
ఖమ్మం, ఆగష్టు 1(జనవిజయం): యస్ఆర్ &బిజీయన్ఆర్ కళాశాల వీధికి గెంటేలనారాయణరావు పేరుపెట్టాలని కళాశాల పూర్వ విద్యార్ధులు జిల్లా కలెక్టర్ ను కోరారు. మంగళవారం యస్ఆర్ & బిజీయన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్ధులు కళాశాల దాత కుమారుడు గెంటేల శేషగిరిరావు నేత్రృత్వంలో జిల్లా కలెక్టర్ పివి గౌతం ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇల్లెందు క్రాస్ రోడ్స్ నుండి యన్టీఆర్ బొమ్మ వరకు ఉన్న రోడ్ కు గెంటేలనారాయణరావు మార్గంగా నామకరణం చేయాలని, కళాశాల భూములు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని, కళాశాల కు80ఎకరాలు కొనుగోలు కు భూరి విరాళం ఇచ్చిన నారాయణరావు విగ్రహం ఇల్లేందు క్రాస్ రోడ్స్ నందు ఏర్పాటు చేయాలని, ఖమ్మం లో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, కళాశాల పైకప్పు కురుస్తున్నందున మరమ్మత్తులు చేయించాలని వినతిపత్రం లో కోరారు.
జిల్లాకలెక్టర్ గౌతం స్పందిస్తూ వీధికి పేరువిషయంలో కమీషనర్ కు సిఫార్స్ చేస్తామని అన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో యస్ఆర్ &బిజీయన్ఆర్ పూర్వ విద్యార్ధుల కో-ఆర్డినేటర్ నల్లమోతు తిరుమల రావు, టి.మణిభూషణాచారి, బొడ్డు వెంకటేశ్వరరావు, ఇస్మాయిల్, ఊడుగు వెంకటేశ్వర్లు, భూతం వసంతరావు, దాత గెంటేలనారాయణరావు కుమారుడు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.