పెనుబల్లి,ఏప్రియల్ 14(జనవిజయం): కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలని సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో గ్యాస్ బండలతో నిరసన వ్యక్తం చేశారు. వి ఎం బంజర్ లోనిఅంబేద్కర్ సెంటర్లో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు మాట్లాడుతూ గ్యాస్ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచిందని, ప్రపంచ మార్కెట్లో కురుడాయిల్ తగ్గిన కేంద్రం రెండు శాతం పన్ను విధించి మోపడం సిగ్గుచేటు అన్నారు. పేదలు వ్యవసాయ కార్మికులు రైతాంగంపై మోపుతున్న బారాలపై కేంద్ర ప్రభుత్వం పట్టనట్లువ్యవహరిస్తూ సంపన్న వర్గాలకు దోచిపెడుతుందని ఆరోపించారు. వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఉపయోగపడే చట్టాలను, కార్మిక రంగానికి ఉపయోగపడే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తొలగించి నియంతృతంగా వ్యవహరిస్తుందన్నారు. గ్యాస్ బండలు నిత్యవసర వస్తువులు ధరలు పెంచి, పేదలు సామాన్యుల ను తీవ్ర ఆర్థిక సంక్షోభం కు గురిచేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో మండల సిపిఎం కార్యదర్శి గాయం తిరుపతిరావు, మిట్టపల్లి నాగమణి, కండే సత్యం , చలమాల నరసింహారావు నల్లమల అరుణ ప్రతాప్ కలకోట అప్పారావు భూక్య ప్రసాదు, తడికమళ్ళ చిరంజీవి, తాండ్ర రాజేశ్వరరావు, తడికమళ్ళ ప్రసాద్ పాల్గొన్నారు.