జనవిజయంతెలంగాణఎట్టకేలకు గాంధీకి వెళ్ళిన కేసీయార్!

ఎట్టకేలకు గాంధీకి వెళ్ళిన కేసీయార్!

  • గాంధీలో కరోనా చికిత్సపై సిఎం కెసిఆర్‌ ఆరా
  • వార్డులను స్వయంగా పరిశీలించి పేషెంట్లకు పలకరింపులు
  • అందుతున్న వైద్య సేవలు, వసతులపై వివరాల సేకరణ
  • సిఎం వెంట మంత్రి హరీష్‌ రావు, ఉన్నతస్థాయి అధికారుల రాక

హైదరాబాద్‌,మే19(జనవిజయం): ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిని సందర్శించి కరోనా చికిత్సపై ఆరా తీసారు. కోవిడ్‌ వార్డులను స్వయంగా పరిశీలించారు. సీఎం హోదాలో మొదటిసారి ఆయన గాంధీ ఆస్పత్రికి వచ్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌ రావు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతులపై ముఖ్యమంత్రి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. అలాగే పేషెంట్లతో కూడా కేసీఆర్‌ మాట్లాడారు. ఆస్పత్రిలో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో సుమారు 18 వందలకుపైగా బెడ్లు ఉన్నాయి. కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డులలో చికిత్స పొందుతున్న పేషెంట్లను సీఎం పరామర్శించి వసతులపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. నేరుగా ఆసుపత్రికి చేరుకున్నాక.. కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. హాస్పటల్లో కొవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితులకు సంబంధించి ఆయన స్వయంగా విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఐసీయూ వార్డులలోకి వెళ్లి ముఖ్యమంత్రి నేరుగా కొవిడ్‌ రోగులను పరామర్శించారు. రోగులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్‌ అభినందించారు.ఈటెల రాజేందర్‌ను తప్పించిన తరవాత ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం స్వయంగా వైద్యానికి సంబంధించిన అంశాలను ఆయన సవిూక్ష చేస్తున్నారు. కాగా కరోనా పేషంట్ల విషయంలో సీఎం కేసిఆర్‌ వ్యవహర శైలిపై ప్రతిపక్ష పార్టీలు అనేక విమర్శలు చేస్తున్నారు. కనీసం ఆయన బయటకు రాకుండా ఉంటున్న తీరును తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ సందర్శనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలావుంటే సీఎం కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రి సందర్శన నేపథ్యంలో పరిసరాల్లో ఆంక్షలు కఠినం చేశారు. గాంధీ వద్ద పోలీసులతో కరోనా పేషంట్‌ బంధువులు వాగ్వాదానికి దిగారు. సీఎం విజిట్‌ నేపథ్యంలో పేషంట్‌ అటెండర్లను పోలీసులు బయటకు గెంటివేసారు. డెడ్‌బాడీలను కూడా తీసుకు వెళ్ళనివ్వకుండా ఆస్పత్రి లోపలికి అనుమతి ఇవ్వడం లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గాంధీ పరిసరాల్లో ఉన్న వారిని రెండు కిలోవిూటర్ల బయట వరకు పోలీసులు పంపించివేసారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి