Thursday, October 5, 2023
Homeవార్తలువచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచే బరిలో కేసీఆర్ - క్లారిటీ ఇచ్చిన మంత్రి హరీశ్ రావు

వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచే బరిలో కేసీఆర్ – క్లారిటీ ఇచ్చిన మంత్రి హరీశ్ రావు

గజ్వేల్, ఆగష్టు 11 (జనవిజయం): సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని ఈసారి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. పార్లమెంట్‌లో కేంద్ర సర్కార్ బీజేపీని ఎండగట్టంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు.

అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ల పాత్రను పోషించలేకపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే బేలగా చూస్తూ కూర్చుండిపోయారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో, అసెంబ్లీలో వాళ్ల పాత్ర పోషించడంలో ఫెయిల్ అయ్యారు. కేసీఆర్ గజ్వేల్‌లో చేయని అభివృద్ధి లేదు. ప్రజలు అడిగిన అభివృద్ధి చేసిండు, అడగని అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండు. గజ్వేల్‌లో ఫారెస్ట్ యూనివర్సిటీ వచ్చింది. ఎడ్యుకేషనల్ హబ్ వచ్చింది. గజ్వేల్‌కు రోడ్లు వచ్చినాయి. బస్సు వచ్చింది. ఒకప్పుడు గతుకుల గజ్వేల్ ఇప్పుడు బతుకుల గజ్వేల్‌గా మారింది. గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ వచ్చింది.

ఇప్పుడు గజ్వేల్ ములుగుకు కోకో కోలా కంపెనీ కూడా వచ్చింది. 1200 కోట్ల పెట్టుబడితో కోకో కోలా కంపెనీ గజ్వేల్ నియోజకవర్గంలో స్థాపించబోతున్నారు. ఒకప్పుడు గజ్వేల్‌లో తాగేందుకు నీళ్లు కరువు ఉండేది. ఈరోజు కొండపోచమ్మ సాగరువల్ల గజ్వేల్ సశ్యామలంగా మారింది. వర్గల్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేశాం. ఇలా గజ్వేల్ లో ఉపాధి కల్పించే ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలను కూడా బలోపేతం చేయడం ద్వారా ఇక్కడ యువతకు ఉపాధి దొరుకుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. గజ్వేల్ చదువులకు నిలయం.. రిజర్వాయర్లకు నిలయం.. ఉపాధి కూడా నిలయమవుతుంది.” అని హరీశ్‌ రావు అన్నారు.

అభివృద్ధి చేసేందుకు.. గెలిపించినందుకు గజ్వేల్ ప్రజల రుణం కేసీఆర్ తీర్చుకున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఇచ్చి కేసీఆర్ రుణం తీసుకోవాలని ఇక్కడి ప్రజలను కోరారు. కేసీఆర్ ఈసారి కూడా గజ్వేల్ నుంచే బరిలో ఉంటారని చెప్పకనే చెప్పేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ మరోస్థానం అసెంబ్లీ నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హరీశ్ రావు కామెంట్స్‌తో క్లారిటీ వచ్చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments