– నిబంధనలు మార్చాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఆగస్ట్ 8 (జనవిజయం) : గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొనే తుది గడువును ఆగస్ట్ 31 దాకా పొడిగించాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం మూడు రోజులే గడువు నిర్ణయించటం వలన ఎక్కువ మంది పేదలు అవకాశాన్ని కోల్పోతారని, నిజంగా ప్రజలకు మేలు చేయదలచుకుంటే మూడు రోజుల గడువు ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పినట్లు దరఖాస్తుకు కావాల్సిన గుర్తింపు కార్డులన్నీ సమర్పించాలంటే సాధ్యం కాదన్నారు. మహిళ పేరుతో స్థలం వుంటేనే పథకం వర్తిస్తుందనే నిబంధన సరికాదన్నారు. అర్హులైన పేదలకు స్థలం ఎవరి పేరుతో వున్నా పథకాన్ని వర్తింప చేయాలని లేదంటే భర్త పేరుతో వున్న స్థలాన్ని భార్య పేరుతో మార్చుకొనే అవకాశం అయినా యివ్వాలన్నారు.
దరఖాస్తులు స్వీకరించటానికి ప్రత్యేక కౌంటర్లు, యంత్రాంగం ఉండాలన్నారు. ఆదాయ,కుల ధృవీకరణ పత్రాలు యివ్వటానికి తహశీల్దార్ కార్యాలయాలలో ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు.