ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ
- ఖమ్మం జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రమిచ్చిన ఎంపీ రవిచంద్ర
- సానుకూలంగా స్పందించిన మంత్రి గడ్కరీ
ఖమ్మం, జులై 21(జనవిజయం):
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన గడ్కరీని కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తల్లాడ-కల్లూరు-పెనుబల్లి-సత్తుపల్లి మార్గాన్ని మరింత విస్తరిస్తూ, అభివృద్ధి పర్చుతూ, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా వినతిపత్రం అందజేశారు.
ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయవలసిందిగా ఎంపీ రవిచంద్ర కోరగా, మంత్రి గడ్కరీ వెంటనే సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.