జనవిజయంజాతీయంగడీల పాలనకు గండి కొడతాం-ఈటెల చేరిక సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

గడీల పాలనకు గండి కొడతాం-ఈటెల చేరిక సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

  • బిజెపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల తదితరులు
  • ఈటెలతో పాటు తుల ఉమ, రమేశ్ రాథోడ్ తదితరులు చేరిక
  • ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా
  • తెలంగాణలో బిజెపి బలోపేతానికి పాటుపడతానన్నఈటెల

న్యూఢిల్లీ,జూన్ 14(జనవిజయం): మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. తన మద్దతు దారులతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఆయన… బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇటీవల టీఆర్ఎన్ కి గుడ్ బై చెప్పిన ఈటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, అందె బాబయ్య, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి సహా అనేకమంది ఉస్మానియా జెఎసి నేతలు కూడా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మురళీధర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో కెసిఆర్ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈటల రాజేంద్రర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా శ్రమిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఈటల వెల్లడించారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానన్న ఆయన… తెలంగాణలో బీజేపీని అన్ని గ్రామాలకు తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని తెలియజేస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారత దేశంలో, తెలంగాణలో బీజేపీని విస్తరించేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నానికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. కమలం గూటికి చేరిన తనకు స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంపై రమేష్ రాథోడ్ అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం లభించడం లేదని తన అనుచరులు, అభిమానులతో మాట్లాడిన తర్వాతనే రమేష్ రాథోడ్ బీజేపీలో చేరినట్లు సమాచారం. రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్ లో కాషాయం బలపడనుంది. గతంలో రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో చేరనుండడంతో ఖానాపూర్ లో రాజకీయ నమీకరణాలు మారనున్నాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో గడీల పాలనకు చరమగీతం పాడుతామన్నారు. తెలంగాన ఆకాంక్షలు నెరవేర్చేలా బిజెపి పనిచేస్తుందన్నారు. .

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి