భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 20 (జనవిజయం): జీఏస్సార్ ట్రస్ట్ అధినేత, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు కొత్తగూడెం లో ఆదివారం ప్రారంభించిన “గడప గడప కు గడల” కార్యక్రమం జయప్రదం గా తొలి రోజు సాగిందని ఆయన అభిమానులు పేర్కొన్నారు. గడపగడపకు గడల కార్యక్రమం కు మంచి ఆదరణ లభిస్తోందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
“గడప గడప కు గడల ఇంటింటికి కొడుకులా” అనే నినాదం తో జి ఎస్సార్ ట్రస్ట్ అధినేత, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు కొత్తగూడెం లో విస్తృతం గా పర్యటిస్తున్నారు. ఇది ఒక రకం గా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు గా స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అందులో భాగం గా ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, జాబ్ మేళాలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక పథకం ప్రకారం గడల అడుగులు వేస్తున్నారు.
సీఎం కేసిఆర్ ఆశీస్సులు తనకే ఉన్నాయని, తాను కొత్తగూడెం లో పోటీ చేసి తీరు తానం టూ పదే పదే తన అనుచరుల వద్ద చెపుతున్నారు. ఇందులో భాగం గా ఆదివారం ప్రచారం ప్రారంభ సంకేతాలు ఇస్తున్నట్లు గా తన కార్యక్రమం ను కొనసాగిస్తున్నారు. స్థానిక 23 వార్డ్ సూర్యోదయ స్కూల్ ప్రాంతం నుండి మేళ తాళాలతో కార్యక్రమం ప్రారంభించారు. వార్డ్ లో దారి పొడవున ఇళ్ల వద్ద పలువురు మహిళలు ఎదురేగి గడలకు బొట్టు పెట్టి హారతులిచి స్వాగతం పలికారు. ఓ అన్న లా ఓ కొడుకుల తమ తొడబుట్టినోడిలా ఆదరించారు.
గాయత్రి హాస్పిటల్ లో డాక్టర్ అల్లూరి నాగరాజు వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి గడల శ్రీనివాసరావు దీవెనలు అందుకున్నారు. సిఎస్ మెమోరియల్ ఆసుపత్రిలో వైద్యులను కలిసి వచ్చారు. ఇలా గడపగడపకు వెళ్తూ అందరినీ గడల ఆకట్టుకున్నారు. గడల కు మద్దతు గా జిఎస్ఆర్ యువసేన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు . ప్రతి మహిళను అమ్మా, అక్కా, చెల్లి అంటూ పలకరిస్తూ గడల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో పాల్వంచ సొసైటి వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ పటేల్, మోదుగ జోగారావు, తదితరులు పాల్గొన్నారు.