Thursday, October 5, 2023
Homeవార్తలుగడలను మంత్రి హరీష్ రావు మందలించారా?! సాంఘిక మాధ్యమాల్లో ప్రచారంలో వాస్తవం ఎంత?

గడలను మంత్రి హరీష్ రావు మందలించారా?! సాంఘిక మాధ్యమాల్లో ప్రచారంలో వాస్తవం ఎంత?

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 21 (జనవిజయం): ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా కొత్తగూడెంలో “గడప గడప కు గడల” అనే కార్యక్రమంతో హడావిడి చేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావును మంత్రి హరీష్ రావు తీవ్రంగా మందలించినట్లు ప్రచారం సాగుతోంది. హెల్త్ డైరెక్టర్ గా ప్రభుత్వ బాధ్యతలో ఉన్న గడల కొత్తగూడెంలో పోటీ చేస్తా అంటూ సేవా కార్యక్రమాల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు గతం నుండి ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయమై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా బిఆర్ఎస్ అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ విషయమై వనమా, గడల మద్య పోటీ నడుస్తున్న విషయం విదితమే. వనమా పై పలుమార్లు ప్రత్యక్షం గాను, పరోక్షం గాను గడల ఆరోపణలు, విమర్శలు చేశారు.

ఈ నేపథ్యం లో ఆదివారం కొత్తగూడెం లో గడల హడావిడి కి వనమా మరోసారి అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వనమా హుటాహుటీన హైదరాబాద్ వెళ్ళారు. అంతకు ముందు గడల కూడా హడావిడిగా హైదరాబాద్ వెళ్ళారు. ప్రచారంలో ఉన్న గడలకు మంత్రి హరీష్ ఫోన్ చేసి మందలించారని, వెంటనే హైదరాబాద్ వచ్చేరమని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది.

నాకు ఎవరూ క్లాస్ తీసు కోలేదు : గడల

కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్లు చేయొద్దని మంత్రి హరీష్ రావు తనకు సూచించినట్లుగా, ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గదల ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.

గడప గడపకు గడల కార్యక్రమంకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా కొత్తగూడెంలో డా.జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments