- 7 స్టార్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- జెండా ఆవిష్కరణ చేసిన కిన్నెర
- స్వాతంత్య్ర సమరయోధులకు పుష్పాంజలి
వేంసూరు, ఆగస్ట్25 (జనవిజయం): సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా వున్న జర్నలిస్టులు తమ బాధ్యతను సక్రమంగా అమలు చేస్తామని,ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని 7 స్టార్ ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం ప్రతిజ్ఞ చేశారు.మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలోని హెర్టేజ్ పాలదుకాణం వద్ద క్లబ్ కార్యాలయం ఎదుట స్వాతంత్ర్య దినోత్సవo సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కిన్నెర వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం స్వాతంత్ర్య సమర యోధుల చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.అనంతరం జాతీయ జెండా కు గౌరవ వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాళ్ళ సత్యనారాయణ,ఉపాధ్యక్షులు పిల్లి జగన్ మోహన రావు,కోశాధికారి ఖమ్మంపాటి రవి,గౌరవ సలహాదారులు ఏమ్.డి.బుర్హానుద్దీన్, సహాయ కార్యదర్శి గుంట్రు సూర్యనారాయణ,ప్రచార కార్యదర్శులు తొమ్మండ్రు శ్రీనివాస్, గోళ్ళమూడి కృష్ణ,ఖమ్మంపాటి మల్లయ్య,కంటే శేఖర్,తొర్లపాటి కరుణాకర్,అంబోజు నరసింహారావు,అయినంపూడి సంతోష్,మల్లూరు చంద్రశేఖర్,హమాలీ కార్మికులు పాల్గొన్నారు.