Thursday, October 5, 2023
Homeవార్తలుఅంటువ్యాధులు ప్రబలకుండా ఫీవర్ సర్వే నిర్వహించాలి : కలెక్టర్ ప్రియాంక అలా

అంటువ్యాధులు ప్రబలకుండా ఫీవర్ సర్వే నిర్వహించాలి : కలెక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 30 (జనవిజయం): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపుకు గురైన గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా ఫీవర్ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం మారుమూల మండలమైన గుండాలలో విస్తృతంగా పర్యటించి దెబ్బతిన్న ఇళ్ళు, వంతెనలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణను పరిశీలించారు. ముత్తాపురం గ్రామంలో ముంపు గురైన ఇళ్లకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.

పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి గ్రామాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. మురుగునీటి నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి జరిగి అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని మురుగునీటి నిల్వలు లేకుండా పరిశుభ్రం చేయాలని చెప్పారు సాయన్నపల్లి – గుండాల మధ్య దెబ్బతిన్న మల్లన్నవాగు, అలాగే మోదుగుల గూడెం వద్ద దెబ్బతిన్న కిన్నెరసాని వంతెనలు మరమ్మత్తు పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వంతెనలు తీవ్ర మరమ్మత్తులు వల్ల రాక పోకలు నికిచి పోయిన గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

వర్షాలకు దెబ్బతిన్న వంతెనలు, రహదారుల మరమ్మత్తు పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాలు వరదల వల్ల ఇళ్ల పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలని పంచాయతి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ఇళ్లతో పాటు జరిగిన నష్టాలపై నివేదికలు అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పరిసరాల్లో మురుగునీటి నిలువలు లేకుండా వారంలో రెండు రోజులు అనగా మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతి అధికారులకు సూచించారు.

ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలితే తక్షణమే అత్యవసర వైద్య కేంద్రాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. వ్యాధులు పూర్తిగా తగ్గే వరకు ఇంటింటి సర్వే చేపట్టాలని చెప్పారు. వ్యాధులు పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఆయా గ్రామాల్లో వైద్య కేంద్రాలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, ఆర్ అండ్ బి ఈ ఈ భీమ్లా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments