జనవిజయంఆంధ్రప్రదేశ్ఏరోజు శాంపిల్ ఫలితాలు ఆరోజే

ఏరోజు శాంపిల్ ఫలితాలు ఆరోజే

ఏలూరు, మే 19 (జనవిజయం): కొవిడ్ టెస్ట్ శాంపిల్స్ ఫలితాలు అదే రోజు వెల్లడించాలని, ఫలితాల వెల్లడిలో జాప్యం ఎట్టిపరిస్థితులలో అనుమతించేది లేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కొవిడ్ ఆంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాపిడ్ టెస్ట్ ఐడీ క్రియేట్ అయిన నాలుగు గంటల లోపు టెస్ట్ ఫలితాలను ఆన్లైన్లో వుంచాలన్నారు. అలాగే విఆర్ఎఎల్, ట్రూనాట్ టెస్టులకు సంబంధించిన ఫలితాలను అదే రోజు వెల్లడించాలన్నారు. టెస్టింగ్ శాంపిల్స్ సకాలంలో విఆర్‌డిఎల్ చేరుకోకపోవడంతోనే ఫలితాల వెల్లడి జాప్యం జరుగుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. రేపటికి ఎవరికి టెస్ట్ చేస్తున్నారో ముందే తెలిసినప్పుడు ఉదయం శాంపిల్స్ తీసుకుని ఉదయం 10 గం.లకు మొదటి విడత టెస్టింగ్ శాంపిల్స్ ఎట్టి పరిస్థితిలో విఆర్‌డిఎల్ ల్యాబ్‌కు చేరాలన్నారు. ఈ విషయమై సంబందిత ఆర్డీఓలు, మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. మున్సిపాలిటీలలో కాకుండా మిగతా ప్రాంతాలలో శాంపిల్స్ సేకరించి ల్యాకు తరలించడానికి 23 వాహానాలు ఏర్పాటుచేసి ప్రత్యేక రూట్ పొగ్రామ్‌ను కూడా అందచేయడం జరిగిందన్నారు.

ఫీవర్‌ సర్వేలో గుర్తించి ఎక్కువ మొత్తంలో ర్యాపిడ్ టెస్టు చేస్తున్నప్పుడు, మిగిలినవారికి చేసే టెస్ట్ శాంపిల్స్ ల్యాబ్‌కు పంపడంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఫీవర్ సర్వేలో కుక్కునూరు, పోలవరం, వేలేరుపాడు మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. ఈ రోజు ఫీవర్ సర్వే పూర్తిచేయాలని, ఫీవర్ సర్వేలో గుర్తించినవారికి శాంపిల్స్ సేకరణ బుధవారం చేయాలని తెలిపారు. ఫీవర్ సర్వే ఇంటింటికి ఖచ్చితంగా జరగాలని, అలా కాకుండా రిపోర్టులు తయారుచేసి పంపితే పరిశీలనలో చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రులలో డిశ్చార్జిలు విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. మే 10వ తేదీ నుండి ఇప్పటి వరకు 1,900 డిశ్చార్జెస్ జరిగాయని తెలిపారు. జంగారెడ్డి ఏరియ హాస్పటల్‌లో పేషెంట్స్ మాట్లాడే, వ్యవహరించే తీరు సరిగా లేదని తన దృష్టికి వచ్చిందని ఇదే విధమైన ఫిర్యాదు మళ్ళీ నాదృష్టికి వస్తే చర్యలు తప్పవని ఏరియా హాస్పటల్ సూపరింటెండెంట్‌ను హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ప్రయివేటు అస్పత్రులలో 50 శాతం బెడ్స్ కేటాయించి చేర్చుకున్న సంఖ్యను ఆరోగ్య శ్రీ పోర్టల్‌లో నమోదుచేయాలని అప్పుడే ఆ సంఖ్య పరిగణలో వుంటుందన్నారు. ఈ రోజు, రేపు కూడా ప్రయివేటు ఆస్పత్రులకు మరోసారి నోటీసులు జారీచేయాలన్నారు. ఆశ్రం హాస్పటల్‌లో నూతనంగా ఏర్పాటుచేస్తున్న ఆక్సిజన్ పైపులైన్ పనులు ఎన్నిరోజులలో పూర్తిచేసి 400 బెడ్‌కు ఆక్సిజన్ సరఫరాచేయగలరని ఎపిఎంఎస్ఏడిసి అధికారిని ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడంతో ఎట్టి పరిస్థితులలోను పనులను పూర్తిచేసి త్వరితగతిన అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జెర్మన్ షెడ్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టి ఆస్పత్రిలో ఉపయోగించని, కొత్తగా వచ్చివున్న బెడ్స్ వేయించాలని, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలండర్స్‌ను కూడా ఏర్పాటుచేయాలని డిసిహెచ్ఎసకు సూచించారు. ట్రిపుల్ సి సెంటర్లలో నేటికి 1,038 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. 104 కాల్ సెంటర్‌లో నమోదు అయిన 3 గంటలలోపే సదరు వ్యక్తులకు ట్రైయాజింగ్ చేసి అవసరమైనచోట చేర్పించాలన్నారు.

ఈ వీడియోకాన్ఫరెన్సులో ఏలూరు నుండి జిల్లా జాయింట్ కలెక్టర్లు కె.వెంకట రమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇన్ ఛార్జి డిఆర్ ఓ జె.ఉదయ భాస్కర్, డిసిహెచ్ఎస్ డా.ఎ.వి.ఆర్ మోహన్, డిఎం& హెచ్ఓ డా.కె.ఎం.సునంద, డిఎఓ సుబ్బరాజు, డిఎఫ్ఓ యశోధాభాయ్, డిటిసి సిరి ఆనంద్, డిఇఓ సివి రేణుక, జిల్లా ఫైర్ ఆఫీసర్ఎ.వి.శంకరరావు, డ్రగ్ కంట్రోల్ శాఖ ఎ.డి ఎస్.విజయ్ కుమార్, డిఐఓ నాగేశ్వరరావు, 108 కో-ఆర్డినేటర్ కె.గణేష్, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి