జనవిజయంతెలంగాణసత్ఫలితాలు ఇస్తున్న హరితహారం

సత్ఫలితాలు ఇస్తున్న హరితహారం

  • ఏపుగా పెరుగుతున్న మొక్కలతో పచ్చదనం
  • రహదారులకిరువైపులా పరుచుకున్న హరిత తోరణం

హైదరాబాద్, జూన్ 11(జనవిజయం): పచ్చదనం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. గత ఐదారేళ్లుగా చేపట్టిన కార్యక్రమంతో ఇప్పుడు తెలంగాణలో మొక్కలు ఏపుగా ఎదిగి పచ్చదనం కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. హరితహారంతో తెలంగాణ గత ఆరేళ్లుగా మంచి ఫలితాలను సాధించింది. గజ్వెల్లో సామాజిక అడవుల పెంపకం మంచి ఫలితాలను ఇచ్చి, ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈ యేడు మరోమారు హరితహారం కోసం తెలంగాణ సిద్ధం అవుతోంది. పచ్చదనాన్ని కోరుకునే నాయకుడిగా కెసిఆర్ చేస్తున్న కృషి వల్ల తెలంగాణలో మొక్కల పెంపకం ఏటా పెరుగుతోంది. రాష్ట్రంలో పచ్చదనానికి ఇస్తున్న ప్రాధాన్యతను అటవీ శాఖ అధికారులు గుర్తించి ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారుల వెంట ఇప్పటికే పచ్చదనం కోసం అటవీశాఖ చేపట్టిన మొక్కల పెంపకంతో ఈ ప్రాంతం పచ్చగా కనిపిస్తోంది.

జాతీయ రహదారుల నిర్వహణ చూస్తున్న ఏజెన్సీలు భద్రతతో పాటు, అటవీ శాఖ నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా పంచుకోవాల్సి ఉంది. మొక్కలు నాటడం, వాటిని సాకడంపై ప్రధానంగా దృష్టి సారించడంతో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. అలాగే జాతీయ రహదారులను ఆనుకుని మొక్కల పెంపకం పెద్దెత్తున చేపడుతున్నారు. ప్రభుత్వ చర్యలు బాగున్నాయని గతంలో నేషనల్ హై వేన్ అధారిటీ గ్రీన్ మిషన్ సలహాదారు ఏకే భట్టాచార్య ప్రశంసించారు. జాతీయ రహదారుల నిర్మాణం, పచ్చదనం ఆవశ్యకతను తెలంగాణ గుర్తించి ముందుకు వెళుతోందని గుర్తించారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ రహదారులు నిర్మించటం ఎంత ప్రధానమో, వాటి వెంట పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవటం కూడా అంతే ముఖ్యం. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరుగుతోంది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో జరుగుతున్న జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర సహకరిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ లో 40 శాతం నిత్యం జాతీయ రహదారుల గుండా వెళోంది. ఉపాధి, అభివృద్ధికి ఈ రహదారులు మార్గాలుగా మారాయి. వచ్చే పదేళ్లలో ఈ విస్తరణ వేగాన్ని మరింత పెంచాలన్న నీతి అయోగ్ ఇప్పటికే సూచనలు చేసింది.

జాతీయ రహదారులు పెరిగితే అదే స్థాయిలో ట్రాఫిక్ తో పాటు, అవి వెలువరించే కర్బన ఉద్గారాలు కూడా పెరుగుతాయి. వీటి ప్రభావాన్ని తగ్గించటమే మిషన్ గ్రీన్ హై వేస్ లక్ష్యం. రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపును వీలైనంత తగ్గించటం, అవసరమయితే భారీ చెట్లను మరోచోట నాటే పద్ధతైన ట్రాన్స్ ప్లాంటేషన్‌కు వెళ్లటం, నిర్మాణం పూర్తయిన రోడ్ల వెంట పెద్దసంఖ్యలో చెట్లను పెంచటం ఈ సమస్యకు పరిష్కారంగా పనిచేస్తున్నారు. అభివృద్ధి, రోడ్ల నిర్మాణం వల్ల వన్యప్రాణులను నష్టం కలగకుండా చూడాల్సి ఉంది. పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యల్లో కార్పోరేట్, స్వచ్చంద సంస్థలతో పాటు ప్రజా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడంతో సమస్యను అధిగమించేలా చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల వెంట మొక్కల పెంపకం మంచి ఫలితాలను ఇస్తోంది. అటవీ శాఖ కొత్త పద్ధతిలో చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ మంచి ఫలితాలు ఇస్తోంది. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి యాదగిరిగుట్ట వరకు పూర్తి అయినందున అక్కడి వరకు వెంటనే గ్రీనరీ చర్యలతో పాటు, వరంగల్ దాకా భవిష్యత్ లో మొక్కల పెంపకం, హైదరాబాద్- అదిలాబాద్ రహదారి వెంట అదనపు పచ్చదనం కోసం ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి