ఏటీఎంల నుంచి డబ్బులు దోచుకుంటున్న ముఠా సభ్యులు అరెస్ట్
…. ఖమ్మం వన్ టౌన్ సిఐ స్వామి..
ఖమ్మం, 07 సెప్టెంబర్(జనవిజయం) : జిల్లాలో ఏటీఎంల నుంచి డబ్బులు కొల్లగొడుతున్న ఓ ముఠా ను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రమాండ్ కు తరలించినట్లు ఖమ్మం వన్ టౌన్ సిఐ స్వామి ఒ ప్రకటనలో తెలిపారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఠాసభ్యులను ఖమ్మం వన్ టౌన్, సిసియస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు.
1) హర్యానా రాష్ట్రం తహశీల్ మేవు జిల్లాకు చెందిన వారిస్, 28 సం,,రాలు, 2)ఉత్తరప్రదేశ్ రాష్ట్రంహామీర్ పూర్ తాసీల్ కు చెందిన నిషాద్ రాధేశ్యామ్ 30 సం,,రాలు, 3) నిషాద్ సంజయ్ లుగా గుర్తించారు.
ఈ ముఠా సభ్యులు ఏటీఎంల నుంచి డబ్బులు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిసిందని తెలిపారు. నగరంలోని ప్రవేటు బ్యాంక్ ఏటీఎంలో డబ్బు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.ఈ ముఠా సభ్యులు హరియాణా రాష్ట్రం తహశీల్ మేవ్ జిల్లా పిప్రోలి గ్రామం,ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బట్‌పుర్తండా జలాలా, కురారా ఠానా గ్రామం, భామిలి పోస్ట్, హమీర్‌పూర్ తహశీల్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల ద్వారా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించి వారి ఒక్కొక్కరి ఖాతాలలో ముప్పై నుండి నలబై వేల వరకు డబ్బు జామ చేస్తారు. వారి ఏటియం కార్డులు తీసుకుంటారు. ఇలా ఏటీఎం కార్డులు తీసుకుని చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఈ ముఠా సభ్యులు జట్టుగా ఏర్పడి ఒకరు ఏటీఎం లోపలకు వెళ్లి యధావిధిగా డబ్బులు డ్రా చేస్తారు.
డబ్బులు ఏటియం మిషన్ నుండి కొద్ది పాటి కనిపించే వరకు బయటకు వస్తున్న క్యాష్ ను చేయి అడ్డుపెట్టి నిలిపేస్తారు. రెండు సార్లు బిప్ శబ్దం రాగనే డబ్బులు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల యంత్రంలో నుంచి నగదు బయటికి వస్తుందే కానీ.. సంబంధిత ఖాతాదారుడి ఖాతాలో మాత్రం లావాదేవీలు విఫలం అయిందని రిసెప్ట్ వస్తుంది.వేంటానే కస్టమర్ కేర్ కు కాల్ చేసి విషయం చెపుతారు. 15 రోజుల్లో తిరిగి వారి ఖాతాలో నగదు జామ అవుతుంది. ఇలా వచ్చిన సొమ్మును ముఠా సభ్యులు, వాటాగా పంచుకుంటారని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు స్టేషన్ రోడ్డులో గల సంభాధ్రి బ్యాంక్ ఏటియం వద్ద వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 34 ఏటీఎం కార్డులు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.