జనవిజయంతెలంగాణమాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతి

మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతి

సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్, మే25(జనవిజయం): మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కాలం చేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నిస్వార్థ రాజకీయనేత అని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం నిజాయితీ కలిగిన సీనియర్ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. స్వాతంత్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం కొనియాడారు. చేకూరి కాశయ్య కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చేకూరి కాశయ్యకు మంత్రి పువ్వాడ నివాళి, సంతాపంత తెలిపిన మంత్రి ఇంద్రకరణ్

మాజీ శాసనసభ్యుడు, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్ ఆవరణంలో ఉంచిన ఆయన భౌతికకాయన్ని మంత్రి పువ్వాడ సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాల్లో విలువలు, సంప్రదాయాలు కడదాక పాటించిన ఓ బాటసారి తన ప్రయాణాన్ని ముగించి మన మధ్య నుంచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతుని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జడ్పీ చైర్మన్ గా తామిద్దరం సమకాలీనులమని, తాను అదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు తను ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నారని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.

నిరాడంబరుడు చేకూరి కాశయ్య: సీపీఐ (ఎం) నేతలు

కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య ఎంతో నిరాడంబర జీవితాన్ని గడిపారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ పేర్కొన్నారు. చేకూరి కాశయ్య మృతికి సంతాపం ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్లో మృతిచెందిన కాశయ్య పార్థివదేహాన్ని ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పంచాయతీలోని గురుదక్షిణ ఫౌండేషన్ భవనంలో ఉంచారు. పార్థివదేహాన్ని సందర్శించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కమ్యూనిస్టేతరుల్లో అత్యంత నిరాడంబర జీవితం గడిపిన తొలితరం నేతల్లో చేకూరి కాశయ్య ముఖ్యులని తెలిపారు. ప్రతీ విషయం పై శాస్త్రీయ అవగాహన, మంచి వాక్పటిమ కలిగి ఉండేవారన్నారు. వేదికకు పరిమితమై ఉపన్యసించేవారని, తక్కువ సమయంలో ఎక్కువ సమాచారంతో ఉపన్యసించడంలో చేకూరి కాశయ్య ముందుండేవారన్నారు. సీపీఐ(ఎం) మద్దతుతో జనతా పార్టీ అభ్యర్థిగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కాశయ్య గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చేకూరి కాశయ్యకు నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి