జనవిజయంజాతీయంఈటెలకు స్వాగతం పలుకుతున్నాం-కిషన్ రెడ్డి

ఈటెలకు స్వాగతం పలుకుతున్నాం-కిషన్ రెడ్డి

  • నియంత కెసిఆర్‌ను దించేందుకు కలసి రావాలి
  • అందుకే పార్టీని బలోపేతం చేస్తున్నాం
  • ఈటెల చేరికను ధృవీకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్,మే31(జనవిజయం): నియంత కేసీఆర్‌ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికి పార్టీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తారని అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నగరంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తనతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారన్నారు. ఈటల చేరికను ముఖ్యనేతలతో సహా అందరూ స్వాగతిస్తున్నారని.. పార్టీలో సానుకూల వాతావరణం ఉందన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు. అనంతృప్తులు సహజమని, సీనియర్ నేత పెద్దిరెడ్డి అనంతృప్తిని పార్టీలో చర్చిస్తామన్నారు.

మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని గతకొంత కాలంగా పుకార్లు వస్తున్నాయి. ఈటల ఢిల్లీకి వెళ్లడంతో వీటికి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. తనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తోనూ ఈటల మాట్లాడారని.. తర్వాతే ఢిల్లీకి పయనమయ్యారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికి పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తారు. అలాగే పార్టీ పెద్దలను కూడా కలిసి మాట్లాడతారు. ఈటల చేరికను ముఖ్యనేతలు సహా అందరూ స్వాగతిస్తున్నారు. పార్టీలో సానుకూల వాతావరణం ఉంది. బీజేపీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నేతలు సహకరించాలి. అసంతృప్తులు సహజమే. సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తాం. అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి నన్ను విమర్శించినంత మాత్రాన నేను స్పందించాల్సిన అవసరం లేదు.

మంచి కేసీఆర్‌కు.. చెడు మోడీకి ఆపాదించడం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు అవసరమైన మేరకు అందించాం. పీఎం కేర్ నుంచి 1,400 వెంటిలేటర్లు అందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదు. భారత్ బయోటెక్, సీరం కంపెనీలకు అడ్వాన్సులు చెల్లించాం. కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ఉపయోగించి ఆక్సిజన్, వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నేను ఓ ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో లక్షా 50 వేల కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా’ అని కిషన్ రెడ్డి వివరించారు. ఇదిలావుంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులెవరూ ఈటల రాజేందర్ వెంట వెళ్లకుండా చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం నాటి కేబినెట్ సమావేశంలో పరోక్షంగా ఈటల అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉందని సీఎం అన్నారు. ఒక్కరు పోయినంత మాత్రమే నష్టమేమిలేదని చెప్పారు. హుజూరాబాద్ బీజేపీ ప్రభావం కూడా చాలా తక్కువేనన్నారు. తప్పు చేసిండు కాబట్టే మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేశామని సీఎం అన్నట్టు తెలిసింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి