జనవిజయంతెలంగాణవెంట్రుక కూడా పీకలేవు - ఈటెలకు గంగుల సవాల్

వెంట్రుక కూడా పీకలేవు – ఈటెలకు గంగుల సవాల్

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్‌
అసైన్డ్‌ భూములను ప్రభుత్వానికి వాపస్‌ ఇవ్వు
నువ్వు సగం బిసివే..నేను పూర్తి బిసిని
గ్రానైట్‌ ద్వారా ట్యాక్స్‌ ఎగ్గొడితే నిరూపించు
హుజూరాబాద్ లో బి.సి- హైదరాబాద్ లో ఓ.సీ
ఈటెల తాటాకు చప్పుళ్లకు బెదరబోమన్న గంగుల

కరీంనగర్‌,మే18(జనవిజయం): ఈటల రాజేందర్‌కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి గంగుల కమలాకర్‌ సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ను బొందలగడ్డగా మార్చినట్లు తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అసైన్డ్‌ భూముల విషయంలో ఈటలను దోషిగా తేల్చారు. సిగ్గుంటే ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల విూడియాతో మాట్లాడుతూ…హుజురాబాద్‌ ప్రజలు ఈటల వెంట ఉంటే..ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేదు అని ప్రశ్నించారు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో గ్రానైట్‌ పరిశ్రమలు నడుస్తున్నాయి. మరి మంత్రి పదవి స్వీకరించిన తర్వాత గ్రానైట్‌ పరిశ్రమలను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? గ్రానైట్‌ పరిశ్రమ నిర్వాహకులతో ఈటల కుమ్మక్కైయ్యారా? అని ప్రశ్నించారు. తమిళనాడు వాసుల గ్రానైట్‌ క్వారీలు నిర్వహిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. కరీంనగర్‌లో 350 గ్రానైట్‌ క్వారీలు ఉంటే.. గంగుల కమలాకర్‌కు ఒక్కటే గ్రానైట్‌ క్వారీ ఉన్నది. ఆ క్వారీ తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఉందన్న విషయం తెలుసుకోవాలని ఈటలకు గంగుల సూచించారు. పన్ను ఎగ్గొట్టానని తనపై ఈటల విమర్శలు చేస్తున్నారు. తాను ఎక్కడైనా పన్ను ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదు రెట్లు అధికంగా చెల్లిస్తానని తేల్చిచెప్పారు. ఈటల బెదిరింపులకు ఎవరూ భయపడరని, తాను కూడా బీసీ బిడ్డనే.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు.

ఈటల కంటే తనకు ఆత్మగౌరవం ఎక్కువ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నందునే ఇన్నాళ్లూ ఈటలను గౌరవించామన్నారు. కార్యకర్తలను ఈటల కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈటల ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకుంటామని మంత్రి గంగు కమలాకర్‌ స్పష్టం చేశారు. వెంట్రుక కూడా పీకలేవు అంటూ వ్యాఖ్యానించారు. ఈటలకు ఆత్మగౌరవం ఉంటే, వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. ఆయన బెదిరిస్తే భయపడేవాడు ఎవడూ లేడన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నారు కాబట్టి ఇన్నిరోజులు గౌరవించామని.. బిడ్డా గిడ్డా అంటే అంతేస్థాయిలో సమాధానం ఇవ్వగలమని అన్నారు. నీలాగ అసైన్డ్‌ భూములను ఆక్రమించుకోలేదు. అసైన్డ్‌ అని తేలాక కూడా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావు.

2004లో దివంగత నేత ఎమ్మెస్సార్‌ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తే… ఆయన కుదరదని తేల్చి చెప్పారు. 2018లో నా ఓటమిని కోరుకున్న వ్యక్తి ఈటల. గెలిచినప్పటి నుంచి అసహనంతో ఉన్నాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు. టీఆర్‌ఎస్‌ పతనాన్ని కోరుకున్న వ్యక్తి ఈటల. సజీవ సాక్ష్యాలివి. దాస్తే దాగేవి కావు. ఇవాళ ఆయన అన్నదానికంటే ఎక్కువగా అనగలను. తట్టుకోలేవు. భయంకరంగా ఉంటుంది. పార్టీని కాపాడుకుంటాం. వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు. సివిల్‌ సప్లై స్కీమ్‌ పెండింగ్‌లో ఉంది. నా పరిధిలోకి రాదని సీఎం దృష్టికి తీసుకు వెళ్లలేదు. నీలా తిన్నింటి వాసాలు లెక్కపెట్టం. సాగర్‌ అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పెట్టి కొన్నామా… తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతారని అంటావా… మాకు పదవులు ముఖ్యం కాదు. కేసీఆర్‌ అధికారంలో ఉంటే చాలనుకుంటున్నాం. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అమ్ముడు పోయినట్టా… నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఆచితూచి మాట్లాడుతున్నాము. ఏం చేస్తావు.. వాట్సాప్‌, యూట్యూబ్‌ లో తిట్టిస్తావు అంతే కదా. ఇదిగో వెంట్రుక కూడా పీకలేవు అంటూ తలపై చేయి వేసి అన్నారు. నేను ఫుల్‌ బీసీని… ఎక్కడైనా బీసీనే. నువ్వు హాఫ్‌ హాఫ్‌ బీసీవీ.. హుజూరాబాద్‌ బీసీవీ… హైదరాబాద్‌ ఓసీవీ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి