జనవిజయంతెలంగాణకరీంనగర్‌ కేంద్రంగానే మరో ఉద్యమం - ఈటెల హెచ్చరిక

కరీంనగర్‌ కేంద్రంగానే మరో ఉద్యమం – ఈటెల హెచ్చరిక

హుజారాబాద్‌లో మలుపెడితే బొందపెడతాం
కొన్నాళ్ల తరవాత నీకూ అదేగతి పడుతుంది
నియోజకవర్గ ప్రజలను బెదరిస్తే ఊరుకునేది లేదు
మంత్రి గంగులకు పరోక్షంగా హెచ్చరించిన ఈటెల

హుజూరాబాద్‌,మే18(జనవిజయం): తన బొందిలో ప్రాణమున్నంత వరకూ హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని మాజీ మంత్రి ఈట రాజేందర్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లో గెలిచినట్లు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని తెరాస నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక నేతలను బ్లాక్‌ మెయిల్‌ చేసే పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. ఆత్మగౌరవ బావుటా ఎగురవేయడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. నాపై కక్షపూరితంగా వ్యవహరించొచ్చు.. కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులుగా వస్తున్నవారు ఏనాడైనా ఆపదలో ఆదుకున్నారా? సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ గెలుపులో తోడ్పాటు అందించారా? కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లను బిల్లులు రావని బెదిరిస్తున్నారు. గ్రామాలకు రూ.50లక్షలు, రూ.కోటి నిధులు రావాలంటే తమతో ఉండాలని చెబుతున్నారు. స్థానిక నేతలపై ఒత్తిడితో రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని హుజూరాబాద్‌, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత అన్యాయం.. అక్రమమా?ఇదేం రాజకీయమని అసహ్యించుకుంటున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అలా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్లే. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు పనికిరావు. కరీంనగర్‌ ప్రజలు ఓట్లేసి గెలిపించింది హుజూరాబాద్‌ ప్రజల్ని వేధించమని కాదు.

2023 తర్వాత నీ అధికారం ఉండదు. ఇప్పుడు విూరేం చేస్తున్నారో.. ఆ తర్వాత మేమూ ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. మర్యాదగా నడుచుకోండి. మా ప్రజలు నన్ను 20 ఏళ్లుగా గుండెళ్లో పెట్టుకున్నారు. దేవుళ్లను మొక్కను.. ప్రజల హృదయాలనే గుడులుగా భావిస్తా. ఆపదలో ఉంటే ఆదుకునే ప్రయత్నం చేస్తుంటా. తల్లిని బిడ్డను వేరు చేసే ప్రయత్నం చెల్లదు. స్థానిక నేతలను ప్రలోభపెడితే తాత్కాలికంగా విూకు జై కొట్టొచ్చు.. కానీ వారి హృదయాలు ఘోషిస్తున్నాయి. హుజూరాబాద్‌ ప్రజల్ని ఎవరూ కొనలేరు. ఇక్కడి ప్రజలు అనామకులు కాదు. ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. దాదాగిరి పద్ధతి, హెచ్చరికలను ఆపకపోతే కరీంనగర్‌ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి ఉంటుందని ఈటల హెచ్చరించారు. మా ప్రాంతానికి ఇంఛార్జ్‌ గా వస్తున్న వాళ్ళు ఇక్కడి ప్రజాప్రతినిధుల గెలుపులో ఏమన్నా సాయం చేశారా ?అని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మాకు సహకరించకపోతే ఊరుకునేది లేదు అంటారా..సర్పంచ్‌లకు ఎంపిటిసిలకు నిధులు రావు విూ గ్రామాలు అభివృద్ధి కావు అంటూ బెదిరిస్తున్నారు.

మంత్రి కాక ముందు సంస్కారం లేకపోతే మంత్రి అయ్యాక అయినా సంస్కారం నేర్చుకోవాలి. కరీంనగర్‌ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు వాళ్ళని చూసుకోవాలి తప్ప హుజురాబాద్‌ పై కక్ష కట్టావో ప్రజలకు తెలుసని ఘాటుగా హెచ్చరించారు. కరీంనగర్‌ ను బొందల గడ్డగా చేసిన చరిత్ర విూది అని అందరికి తెలుసు అని అన్నారు. ఎన్నికోట్ల సంపద విధ్వంసం అయిందో సీఎం గారికి చెప్పా ధర్మాన్ని మెుక్కుతా న్యాయాన్ని మెుక్కుతా 20 ఏళ్లుగా కలిసి మెలసి బ్రతికన మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గము 50 మల మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గము. సహచర మంత్రి వస్తాడని తెలిసినది రా చూస్తాం? అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అప్పుడు 2006 లో కరీంనగర్‌ లో ఎంపీ గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌ నాయకులు, రాజశేఖర్‌ రెడ్డి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా తెంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్‌ లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు. హుజురాబాద్‌ లో విూ రాజకీయాలు నడవవు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ హుజురాబాద్‌ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నా.. ఇకపై కూడా ప్రాణం పోయినా ఇబ్బంది కానివ్వను. విూరు చేసిన పనికి ప్రజా ప్రతినిధులు దోషులుగా నిలబడుతున్నారు. మాపై కుట్రలు చేస్తే కరీంనగర్‌ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది అని చెప్పిన ఈటల హుజురాబాద్‌ ప్రజలు ఓపికతో ఉండాని తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి