జనవిజయంతెలంగాణఎం.ఎల్.ఎ పదవికి ఈటెల రాజీనామా చేయాలా? వద్దా? మీ ఓటు దేనికి?

ఎం.ఎల్.ఎ పదవికి ఈటెల రాజీనామా చేయాలా? వద్దా? మీ ఓటు దేనికి?

టెల రాజేందర్. ఒకప్పటి తెలంగాణ ఉద్యమకారుడు. ప్రస్తుతం హుజూరా బాద్ తె.రా.స ఎం.ఎల్.ఏ. భూకబ్జా ఆరోపణలతో కేసీయార్ మంత్రి వర్గం నుండి బహిష్క్రుతుడైన మాజీమంత్రి. ఈటెల ఇపుడు కేసీయార్ వ్యతిరేక శక్తులకు ఒక ఆయుధం. ఆయన మంత్రి వర్గం నుండి బర్త్ రఫ్ అయిన తరువాత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తానంటున్నారు. అలాంటపుడు మొదటిగా ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేస్తారని తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పదని అందరూ భావించిన వేళ ఈటెల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికిపుడు రాజీనామా చేయనని కానీ ఖచ్చితంగా హుజూరాబాద్ నుండే ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచి తీరుతానని అంటున్నారు. హుజూరాబాద్ లో ఈటెల సైన్యాన్నిబలహీనపరచేందుకు మంత్రి గంగులను ప్రయోగించారు కేసీయార్. బయటకు గంగుల కనపడుతున్నా కేసీయార్ స్వయంగా ప్రతి అడుగు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించి, మాజీ ఎం.పీ వినోద్ ను, అవసరమైతే అక్కడ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని కూడా కలుపుకుని ఈటెలను ఓడించి తీరాలని చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అధికారులను బదిలీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను బిల్లులు రావని బెదిరిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. కేసీయార్ కనుసన్నలలో చుట్టూ పద్మవ్యూహం, కుట్రలు, కుయుక్తులు కమ్ముకున్న నేపథ్యంలో ఈటెల వెంటనే రాజీనామా చేయడం కన్నా వేచిచూడడం మంచిదనే అభిప్రాయం కూడా విశ్లేషకులలో వినిపిస్తున్నది. ఈటెల వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే …… అధికార పార్టీ బలంతో తట్టుకోలేక హుజూరాబాద్ లో ఓడిపోతే ఈటెల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనీ, కేసీయార్ వ్యతిరేక శక్తులకూ ఇది ఇబ్బందేననీ భావిస్తున్నారు. అలా అని రాజీనామా చేయకుండా ఆత్మగౌరవ బావుటా అనడమూ సరైనది కాదనే వాదనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటెల ఏం చేస్తే బాగుంటుంది? క్రింది పోల్ లో మీ ఓటు వేయడం ద్వారా మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఈ విషయమై ఇంకేదైనా చెప్పదలచుకుంటే కమెంట్ చేయండి.

ఈటెల రాజేందర్ ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేయాల్నా? వద్దా? Live

  • చేయాలి
    0% 0 / 26
  • అవసరం లేదు.
    100% 26 / 26
  • చెప్పలేను
    0% 0 / 26

For All Polls Click HERE

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి