జనవిజయంతెలంగాణఈటెలపై హరీష్ తూటాలు మనస్పూర్తిగా వదులుతున్నాడా? (పోల్)

ఈటెలపై హరీష్ తూటాలు మనస్పూర్తిగా వదులుతున్నాడా? (పోల్)

కొన్ని సందర్భాలలో రాజకీయాలు క్రూరంగా ఉంటుంటాయి. ఇప్పటి రాజకీయాలు నిరంతరం కుయుక్తులు, కుట్రలతో కూడిన ఎత్తుగడలతో నిత్యం మనిషిలోని మానవత్వాన్ని నిలువునా చంపేస్తున్నాయి. బయటి మనిషికి లోపలి మనసుకూ అత్యధిక శాతం పొంతన ఉండడం లేదు. విషయానికి వస్తే హరీష్ రావు ఎట్టకేలకు నోరు విప్పి ఈటెల ఆరోపణలపై స్పందించారు. మాజీ మిత్రుడిపై మండి పడ్డారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. “ఆయన సమస్యలు, గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావిస్తున్నారు. అది ఈటల భావ దారిద్యానికి, విజ్ఞత లేమికి నిదర్శనం. ఆయన ప్రయోజనాల కోసం నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల, వికార ప్రయత్నం” అని ధ్వజమెత్తారు. రాజేందర్ మాటల్లో మనోవికారం తప్ప ఎంతమాత్రం సత్యం లేదని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈటల పార్టీని వీడడం వల్ల వీసమెత్తు నష్టం లేదని పేర్కొన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవ కన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువన్నారు. ‘కేసీఆర్ నాకు తండ్రితో సమానం. ఆయన మాట శిరసా వహిస్తా. నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా నా కర్తవ్యంగా స్వీకరిస్తా’ అని శనివారం ఒక ప్రకటలో తెలిపారు. అంతక్రితం టీఆర్ఎస్ లో అందరి కంటే ఎక్కువ అవమానాలు అనుభవించేది హరీష్ అని, ఇపుడు తనను ఓడించడానికి తన మిత్రుడునే కేసీయార్ పావుగా వాడుతున్నడని వ్యాఖ్యలు చేశారు. కానీ వాటిపై వెంటనే హరీష్ స్పందించకపోవడం గమనార్హం. చివరికి పార్టీ ఆదేశాలమేరకు హరీష్ ఈటెలపై తాజా కమెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని క్రింది పోల్ లో ఇచ్చిన ఆప్షన్స్ ని వాడుకుంటూ ఓట్ చేయండి. ఈ విషయంపై ఇంకేమైనా చెప్పదలచుకుంటే కమెంట్ చేయండి.

ఈటెలపై హరీష్ రావు తూటాటు మనస్పూర్తిగా వదులుతున్నవేనా? (పోల్) Live

 • మనస్పూర్తిగానే మాట్లాడుతున్నాడు.
  3% 1 / 26
 • మనసు చంపుకుని తప్పక మాట్లాడుతున్నాడు.
  42% 11 / 26
 • తనకూ ఈటెల గతి పట్టకుండా ఉండేందుకు అనివార్యంగా మాట్లడాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.
  0% 0 / 26
 • భవిష్యత్తులోనూ హరీష్ అవమానాలను తట్టుకుని టీఆర్ఎస్ లో నిలవగలిగినపుడు చెప్పొచ్చు.
  53% 14 / 26

For All Polls Click HERE

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి