జనవిజయంతెలంగాణఈటెల 'చే'జారడానికి కారణమేమిటి?

ఈటెల ‘చే’జారడానికి కారణమేమిటి?

టెల రాజేందర్ ని కే.సీ.యార్ అత్యంత అవమానకరంగా మంత్రి పదవినుండి బయటకు పంపడంతో తెలంగాణా రాజకీయాలలో కీలక మలుపులు జరుగుతాయనుకున్నారు. కే.సీ.యార్ వ్యతిరేక శక్తులు ఐక్యం అవుతాయని భావించారు. ఆమేరకు కొండా విశ్వేశ్వరరెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వారు ప్రయత్నించారు. ఈటెల కూడా ఏం చేయాలనేదానిపై వివిధ నేతలతో చర్చించారు. ఒక దశలో ఆయన ఢిల్లీ వెళ్లి సోనియాను కలవబోతున్నారని, కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో సీన్ రివర్స్ అయి ఆయన ఢిల్లీ అయితే వెళ్లారు కానీ బిజెపి నేతలను కలసి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన హామీలు తీసుకుని బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.

మొదట ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు రాగానే ఆయనకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీనే. ఈటెల భూములను ఆనుకునే టిఆర్ఎస్ నేతల భూముల కబ్జాలున్నాయని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గట్టిగానే నినదించారు. దీనితో టి.ఆర్.ఎస్ నేతలు ఉలిక్కి పడ్డారు కూడా. ఈ నేపథ్యంలోనే ఈటెల కాంగ్రెస్ లో చేరవచ్చని లేదా కే.సి.యార్ వ్యతిరేకులతో కలసి పార్టీ పెట్టవచ్చని భావించారు. ఈటెల బిజెపిలో చేరతారని ఎవరూ ఊహించలేదు. వామపక్ష భావాలు కలిగి, ఉద్యమ పార్టీలో పోరాడిన చరిత్ర ఉన్న ఈటెల రాజేందర్ నేపథ్యం తెలిసినవారంతా మొదటి రెండు ఆప్షన్లనే ఈటెల ఎంచుకుంటారని భావించారు. చివరి దశలో ప్రొఫెసర్ కోదండరామ్, కొండా విశ్వేశ్వర రెడ్డి లు కలసి ఈటెలను కలిసినపుడు ఈటెల తాను బిజెపిలో చేరడంలేదంటూ ప్రకటించారు కూడా. అయితే హూజూరాబాద్ కేంద్రంగా కే.సీ.యార్ తన ఎత్తులతో ఈటెలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుండడంతో ఆయన కాస్త ధైర్యం కోల్పోయారు. పార్టీ పెట్టడానికి చర్చలు జరిపి కూడా తటపటాయించారు.

కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క వంటి వారితో కూడా ఆయన భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి మినహా కే.సి.ఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాడేవారు లేరనే నిర్ణయానికి వచ్చిన ఈటెల తన ఆంతరంగికులతో మాట్లాడుతూ ఇపుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ లో చేరినా టీఆర్ఎస్ పై నికరంగా పోరాడలేమని అన్నట్లు సమాచారం. అయితే కేంద్రంలో బిజెపి కూడా టి.ఆర్.ఎస్ తో మెతకగా వ్యవహరిస్తుందన్న నిర్ణయంలో ఉన్న ఈటెలకు రాష్ట్రంలోని బిజెపి నేతలు గ్రూపులకతీతంగా (పెద్దిరెడ్డి లాంటి వారు మినహా) అండగా నిలవడం, ఢిల్లీలోనూ కేంద్ర జిజెపి నేతలు కూడా టీఆర్ఎస్ పై దూకుడుగానే వెళతామని, బెంగాల్ మాదిరిగానే తెలంగాణలోనూ అధికారం చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతామని, కేసీయార్ ఎత్తులకు భయపడవద్దని ఈటెలకు హామీ ఇవ్వడంతో ఆయన అనివార్యంగా బిజెపిలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో బిజెపిలోకి వెళ్ళడమే మంచిదని ఈటెల కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేశారని తెలుస్తోంది. బిజెపి నుండి పెద్దిరెడ్డి కొంతమేరకు గోల చేసినా రాష్ట్ర బిజెపి నాయకత్వం అంతా ఈటెలకు అండగా ఉండడం, కేంద్ర పెద్దలతో మాట్లాడడం చకచకా జరిగిపోయాయి.

మరోవైపు రాష్ట్రంలో బలం ఉండీ, అనైక్యతా రాగాలతో ఎవరికి వారే యమునా తీరేగా ఉన్న కాంగ్రెస్ ఈటెలకు ధైర్యం కల్పించడంలో సరైన పాత్ర పోషించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి మినహా ఎక్కడా, ఎవరూ కూడా ఈటెలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించలేదనే చెప్పాలి. రేవంత్ రెడ్డికి బలం పెరుగుతుందేమోనన్న ఈర్ష్యతో కూడా ఈటెలను రాబట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయలేదనే ఆరోపణలూ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో కే.సీ.యార్ కు కోవర్టులున్నారంటూ ప్రచారం ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారు కూడా కాంగ్రెస్ పి.సి.సి చీఫ్ నియామకంలో లొల్లి, నేతల మధ్య అనైక్యతల వల్ల విసిగి పార్టీకి గుడ్ బై చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం గట్టి క్యాడర్ కలిగి ఉన్నా , తెలంగాణా ఇచ్చిన పార్టీగా పేరున్నా ఎందుకో కాంగ్రెస్ ఏమాత్రం ఎదగలేకపోతోంది.

ఎవరైనా గట్టిగా పోరాడేవారుంటే క్రిందకు లాగే ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తారు. శత్రవుపై పోరాడడంలో మాత్రం ముందుకు రారు. ఈటెల కాంగ్రెస్ లో చేరతాడేమోననే అనుమానంతో హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డితో ఈటెలపై విమర్శలు కురిపించారు. ఇలాంటి పరిస్థితులలో, ఓవైపు ఉన్నవారే బయటకు వెళుతుంటే, మరోవైపు ఉన్నవారిలో ఐక్యత కానరాకుంటే కొత్తవారు పార్టీలోకి రావడానికి సాహసించకపోవడం ఆశ్చర్యం కాదు. సరిగ్గా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇపుడు ఇదే ఆలోచనలో పడినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షుని నియామకంలో వెంటనే తేల్చకపోతే తెలంగాణలో అధికారం సంగతేమోగానీ అసలుకే ఎసరు వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ ని పిలిపించుకుని పిసిసి ఛీఫ్ కసరత్తును ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం జరుగబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు పీసీసీ రేసులో తామున్నామంటూ నేతల ప్రకటనలు మళ్ళీ షురూ కావడం గమనార్హం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి