జనవిజయంతెలంగాణఈటెల బిజెపిలో చేరుతాడని ఊహించలేదు-జీవన్ రెడ్డి

ఈటెల బిజెపిలో చేరుతాడని ఊహించలేదు-జీవన్ రెడ్డి

దీంతో ఆయన వ్యక్తిత్వం దెబ్బతింది

హైదరాబాద్, జూన్ 8(జనవిజయం): బిజెపిలో చేరడం ద్వారా ఈటెల రాజేందర్ బలహీనత బయటపడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈటెల బీజేపీతో కలుస్తారని తాను ఊహించలేదన్నారు. ఈటెల ..కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లడతానని బీజేపీలో చేరడం ఏంటో అర్థం కావట్లేడం లేదన్నారు. ఈటెల బీజేపీలో చేరుతూ వ్యక్తిత్వం కోల్పోయారన్నారు. ఈటెల స్థాయి ఆయనే తగ్గించుకుని.. నియోజక వర్గానికి పరిమితం అయ్యాడన్నారు. కాంగ్రెస్ లో చేరడం చేరకపోవడం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇష్టమన్నారు. టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తోందన్నారు. అవినీతి చేసిన టీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో పెడతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు. ఈటల బీజేపీలో చేరడం వల్ల బలహీన పడ్డారని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే వేరే విధంగా ఉండేదన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతానని తన వ్యక్తిత్వాని తగ్గించుకున్నారన్నారు. ఇండిపెండెంట్ గా ఈటల నిలబడితే 50 వేల ఓట్లతో గెలిచేవారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పిసిసి పదవి కాంగ్రెస్ నాయకుడికే ఇస్తారని.. బయటోళ్లు..కొత్తోళ్లు అని ఉండదన్నారు. కాంగ్రెస్ ని ఎవరో నడపడని.. కాంగ్రెస్ ను నడిపిస్తుంది రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు 90 శాతం మంది దళితులే, వారిని తొలగించడం మానవత్వం లేని అమానవీయ చర్య అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలా డబ్బులు 2 నెలల నుంచి చెల్లించడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి