జనవిజయంతెలంగాణఈటెల అస్త్రంగా బిజెపి ని దెబ్బ తీస్తున్న తెరాస

ఈటెల అస్త్రంగా బిజెపి ని దెబ్బ తీస్తున్న తెరాస

  • ఈటెల బిజెపిలో చేరుతారన్న ప్రచారం
  • ఈటెల రాకను వ్యతిరేకిస్తూ బిజెపి నుంచి టిఆర్ఎస్ లోకి
  • మంత్రి గంగుల సమక్షంలో పార్టీలో చేరిన నేతలు

కరీంనగర్,మే28(జనవిజయం): ఆపరేషన్ ఈటెల ఆగడం లేదు. ఏ చిన్న అవకాశాన్నైనా వదలద్దని కేసీఆర్ ఆదేశించినమేరకు మంత్రి కమలాకర్ ప్రయత్నిస్తున్నారు. మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈటల రాకను బీజేపీలో కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని వెనుక టి.ఆర్.ఎస్ ప్లాన్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈటల రాకపై ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జల్లాలోని పలువురు నేతలు ఉలిక్కిపడుతున్నారు. ఇదే అదునుగా బీజేపీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ రాకను వ్యతిరేకిస్తూ హుజురాబాద్ మున్సిపల్ 11 వ వార్డు బీజేపీ కౌన్సిలర్ దండ శోభ, మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. గత హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో దండ శోభ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో ఆమె బీజేపీలో చేరారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతున్నామని, అందువల్లే టీఆర్ఎస్ లో చేరుతున్నామని దండ శోభ ప్రకటించారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత పెద్దిరెడ్డి అనంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని మీడియా ప్రతినిధులతో ఆయన అన్నారు. ఆయన చేరిక సమాచారం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు. ఈటలను బీజేపీలో చేర్చుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరో ఇద్దరు అగ్రనేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో, టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. ఈటల కూడా ఉద్యమ కారుడే. ఆయనకు అండగా నిలిచి న్యాయం చేయాలి’ అని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి