జనవిజయంజాతీయంఈటెల అనుమానాలు నివృత్తి అయినట్లేనా? బి.జె.పీ లో చేరిక ఖాయమేనా?

ఈటెల అనుమానాలు నివృత్తి అయినట్లేనా? బి.జె.పీ లో చేరిక ఖాయమేనా?

టెల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో భా.జా.పా జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా తో సమావేశమయ్యారు. ఆయన బి.జె.పి లో చేరెందుకే ఢిల్లీ వెళ్లారని వార్తలు వస్తున్నా ఈటెల స్వయంగా ప్రకటించేవరకు ఆయన వైఖరి ఏమిటనేది అంచనా వేయకూడదని ఈటెల అనుచరులు చెపుతున్నారు. మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్ అయిన దగ్గరనుండి రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై వివిధ పార్టీల ముఖ్యనేతలతో సమావేశమవుతున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారని, కాదు బి.జె.పీలో చేరతారని లేదు స్వంతంగా పార్టీ పెడతారని ఊహాగానాలు వినవచ్చాయి. గత రెందు రోజులుగా ఆయన బి.జె.పి లో చేరినట్లేనని రాష్ట్ర భా.జా.పా నాయకుల మాటలను బట్టి కూడా కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఆయన బి.జె.పి లో చేరతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కోదండరాం, కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి వారు వారించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను బి.జె.పి లో చేరడం లేదని హుజూరాబాద్ నుండి స్వయంగా ఇండిపెండెంట్‌గానే రంగంలోకి దిగుతానని అన్ని పార్టీల మద్దతుతో ఆత్మగౌరవయాత్ర చేస్తానని అనంతరమే తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని రాజేందర్ స్పష్టం చేశారు.

అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి ఈటెల బి.జె.పి లో చేరడానికే ఆ పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడేందుకు, తనకున్న అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే ఢిల్లీ వెళ్లారని భావిస్తున్నారు. ఈటెల భార్య జమున కూడా టీ.ఆర్.ఎస్ పైనా, కె.సీ.ఆర్ పైనా ఘాటుగా విమర్శలు చేస్తూ, ధీటుగా స్పందిస్తూ ప్రెస్‌మీట్ పెట్టడం కూడా తెలంగాణా రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అంతక్రితం రాజెందర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలుస్తారంటూ వార్తలు వచ్చినా ఆయన వాటిని ఖండించలేదు. కానీ ఆయన కాంగ్రెస్ అధినేత్రిని కలవలేదు. భా.జా.పా అగ్ర నేతలతో ఆయన కే.సీ.ఆర్-భా.జా.పాల మధ్య గల లోపాయకారీ ఒప్పందాలను గురించి అడిగినట్లు తెలిసింది. తాను భా.జా.పాలోకి వస్తే కీలక పదవితో పాటు, తె.రా.సా కు వ్యతిరేకంగా భా.జా.పా నిలబడాలన్న డిమాండ్లపై హామీ అడిగినట్లు సమాచారం. బెంగాల్ కంటే ఎక్కువ దూకుడుగా తెలంగాణలో భా.జా.పా పని చేస్తుందని అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని వారు అభయం ఇచ్చారనీ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు నడ్డా స్పష్టం చేసినట్లు తెలిసింది. కే.సీ.ఆర్ కావాలని ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటాడని వాటిని తెలంగాణ ప్రతిపక్షాలు తిప్పికొట్టాలని సూచించినట్లు చెప్తున్నారు. ఈటెలతో పాటు ఎవరెవరు బిజెపిలోకి వస్తారు? అధికార పార్టీలో అసమ్మతితో రగులుతున్నవారెవరు? కాంగ్రెస్ నుండి కూడా బిజెపిలోకి వస్తారా? వంటి అనేక విషయాలు ఈటెల, నడ్డాల మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. అన్ని విషయాలను మాట్లాడిన ఈటెల మరోసారి తన అనుచరులతో అన్ని విషయాలు చర్చించి తన నిర్ణయం తెలుపుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే విషయాన్ని నాన్చకుండా వీలైనంత త్వరగా తేల్చాలని భాజాపా నేతలు కోరినట్లు తెలిసింది. ఈటెల మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉండి మరికొందరు నేతలతో సమావేశమౌతున్నట్లు తెలుస్తోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి