జనవిజయంఎన్నికలుఈటెల పార్టీ పెట్టడం లేదా? ఓ కీలక నిర్ణయానికి వచ్చేశారా?

ఈటెల పార్టీ పెట్టడం లేదా? ఓ కీలక నిర్ణయానికి వచ్చేశారా?

  • ఈటెల దారి ఏ పార్టీ వైపు?
  • ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నారా? లేదా?
  • కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు జోరుగా ఇదే చర్చ

కరీంనగర్, మే26(జనవిజయం): మాజీమంత్రి ఈటెల రాజేందర్ అడుగుల ఎటువైపు అన్న చర్చ ఓ వైపు.. ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అన్న చర్చ మరోవైపు సాగుతోంది. జిల్లాలో కరోనా కష్ట కాలంలోనూ ప్రజలు ఈ చర్చకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈటెల పార్టీ పెడతారా? లేక బిజెపిలో చేరుతారా? అన్నది కూడా చర్చగా మారింది. లేకపోతే తెలంగాణ ఉద్యకారులను ఏకం చేసి కోదండరామ్ ను కలుపుకుని పోతారని మరోరకమైన చర్చా సాగుతోంది. నిజానికి ఈటెల ఏం చేయబోతున్నారన్నది ఎవరికీ తెలియదు. ఈటెల కూడా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈటెల పార్టీ పెట్టడానికే మొగ్గు చూపుతున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమైందని గత రెండురోజులుగా జోరుగా ప్రచరాలు ఊపందుకుంటుండంతో ఈ విషయంపై మరింత ఉత్కంఠ పెరిగింది. ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు? అనే అనుమానంతో ఆరా తీస్తున్నవారూ ఉన్నారు. మొత్తానికి ఇపుడు ఈటెల ఏవైపు అడుగులు వేయబోతున్నారన్నది కీలక అంశంగా మారింది. తెరాస ఓ వైపు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తూ నానా హడావిడి చేస్తున్నా అవన్నీ తాటాకు బాంబులేనని ఈటెల వర్గం కొట్టి పారేస్తుంది. కేవలం కరీంనగర్ లో మాత్రమే గాక సోషల్ మీడియాలో ఈటెల వర్గం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసి మరీ ఈటెలపై వస్తున్న ఊహాగానాలను, చర్చలను తిప్పికొడుతుండం విశేషం.

కిషన్ రెడ్డితో ఈటెల భేటీలో ఏమి చర్చించారో అన్న విషయాలు మాత్రం వెల్లడి కాకున్నా శాసనసభ్యత్వానికి మాత్రం ఇప్పుడిప్పుడే రాజీనామా చేయవద్దని ఈటలకు సూచించినట్లు తెలుస్తున్నది. బీజేపీలో చేరిన తర్వాత ఆలోచించి రాజీనామా విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఈటల రాజేందరకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆయన రాజీనామా చేసినా హుజురాబాద్ స్థానంలో ఆయన సతీమణి జమునను పోటీలో దింపుతారని ప్రచారం జరుగుతున్నది. బీజేపీ ముఖ్య నేతలతో ఈటెల అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఒక పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ వివేక్ కూతురు, ఏనుగు రవీందర్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి మొయినాబాద్ లోని వివేక్ ఫాంహౌన్ కు వెళ్లారు. అదే సమయంలో ఈటల రాజేందర్ కూడా అక్కడికి చేరుకున్నారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు, అధికారుల మూకుమ్మడి బదిలీలు ప్రస్తావనకు వచ్చాయి. తన పై రోజుకో కేసు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసే అంశం ప్రస్తావనకు రాగా.. ప్రస్తుతం రాజీనామా చేయకపోవడమే మంచిదని బీజేపీ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఆయన బీజేపీలో చేరతారా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాకున్నా, ఈటల అడుగులు మాత్రం కమలం వైపే ఉన్నాయన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో ఉంది. ఈటల తనను సంప్రదించిన మాట వాస్తవమేనని కిషన్ రెడ్డి అంగీకరించారు. ఇకపోతే తెలంగాణ ఉద్యమకారులంతా ఏకం కావాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిస్తున్నారు. సిఎం కెసిఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదామని అంటున్నారు. దీనిపైనా పెద్దగా స్పందన రావడం లేదు. అనేకమంది ఇప్పటికే వివిధ పార్టీల్లో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాన్నది ఆసక్తిగా మారింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి