జనవిజయంతెలంగాణఈటెలతో పాటు ఆ నేతలు కూడా అటేనా?!

ఈటెలతో పాటు ఆ నేతలు కూడా అటేనా?!

  • ఈటెల రాజేందర్ చుట్టూ బిజెపి రాజకీయాలు
  • పార్టీలో చేరడం ఖాయమంటూ ప్రచారాలు
  • ఈటెలతో పాటు మరికొందరు నేతలంటూ ఊహాగానాలు

హైదరాబాద్,మే26(జనవిజయం): తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఈటెల రాజేందర్.. గురించే చర్చ జరుగుతోంది. ఈటల ఏం చేయబోతున్నారని అంతటా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కార్యకర్తల అభిప్రాయాలు, బండి సంజయ్ తో చర్చలతో పాటు వివిధ సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత.. కాషాయ గూటిలో చేరారని నిర్ణయించుకున్నట్లు పలు మీడియా ఛానళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖాయమైందని కొందరు బిజెపి నేతలు కూడా ఆమోదిస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా కమలం దళంలో చేరతారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తులా ఉమ కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరు నేతలు ఈటలతో సమావేశమయ్యారు. అంతేకాదు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రమేష్ రాథోడ్ సైతం ఈ గ్రూప్ లో ఉన్నట్లు సమాచారం. అందరూ ఒకేసారి కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ అనంతరం.. బీజేపీలో చేరికపై ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కమలం పెద్దలు హామీ ఇచ్చారని అంటున్నారు. ఇక టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులతో పాటు ఉద్యమ నాయకులను బీజేపీలోకి తీసుకొస్తానని ఈటల చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికిన వెంటనే వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. ఐతే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో బీజేపీ పెద్దలు అపాయింట్ మెంట్ ఇస్తారా లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నికలు వస్తే.. ఈటల రాజేందర్ పోటీచేయబోడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చి.. బీజేపీ కేంద్రమంత్రి పదవి ఇవ్వనుందన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. హుజురాబాద్ లో ఈటల నతీమణి జమున పోటీ చేస్తారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. కాగా, తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందరను ఇటీవలే కేబినెట్ నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంతో పాటు మరోచోట చోట్ల భూకబ్దాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో వేటువేశారు. అప్పటి నుంచి నియోజకవర్గ కార్యకర్తలతో పాటు పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో వరుసగా భేటీలు జరిపారు ఈటల. తాను ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. ఐతే కోవిడ్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఉపఎన్నికలతో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అన్ని విధాలుగా ఆలోచించుకున్న తర్వాత బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. ఏమైనా రాజేందర్ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని అభిమానులు అంటున్నారు. ఈటెల నోట అసలు మాట వెలువడేదాకా వేచి చూడండని అభిమానులు అంటున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి