- 23 నుండి 30 వరకు అదే పని
- ఈవిఏమ్ ల పై అవగాహన కల్పిస్తున్న రెవిన్యూ శాఖ
- పరిశీలించిన ఆర్ డి ఓ సోంపాక
వేంసూరు, ఆగస్ట్ 24 (జనవిజయం): వేంసూరు మండలంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జిల్లా కలక్టర్ విపి గౌతమ్ ఆదేశాల మేరకు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట పలు పనులపై వచ్చిన ప్రజలకు ఓటు వేసే ఈవిఏమ్ యంత్రాలపై మండల తహశీల్దార్ ఏమ్.ఏ.రాజు ఆధ్వర్యంలో డమ్మీ మొబైల్ ఈవిఏమ్ లో నేరుగా ఓట్లు వేయించుతు అవగాహన కల్పించారు. అట్టి కార్యక్రమాన్ని కల్లూరు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్డిఓ) సోంపాక అశోక చక్రవర్తి వేంసూరులో ఆకస్మిక పర్యటన చేసి పరిశీలించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23 నుండి 30 వరకు ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్లకు మొబైల్ ఈ వి ఏమ్ ల ద్వారా అవగాహన కల్పిస్తామని, ఏ గుర్తుకు ఓటు వేసిన ఒకే గుర్తుకు పడుతుందనే అభద్రతాభావం ఓటర్లలో పోగొట్టి చైతన్యం చేసే దానికే ప్రతిష్టాత్మకంగా ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ కరుణశ్రీ, గిరిదావర్ లు హరిప్రసాద్, చిరంజీవి, సీనియర్ సహాయకులు దూప కుంట్ల జగదీష్, జూనియర్ సహాయకులు కిరణ్, బింగి మహేశ్వరరావు, బేబీ, అజయ్, గోపాలకృష్ణ, గ్రామ పంచాయతీ కార్మికుడు కిన్నెర రత్నకుమార్, సీపీఎం నేతలు మల్లూరు చంద్రశేఖర్, సాధు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.